Breaking News

ఏడేళ్ల చిన్నారిపై సామూహిక లైంగిక దాడి

Published on Thu, 07/31/2025 - 12:06

మహబూబ్ నగర్ జిల్లా: అభం శుభం తెలియని చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంఘటన జడ్చర్లలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జడ్చర్లలోని 167 నంబర్‌ జాతీయ రహదారిని ఆనుకునిఉన్న ఓ కాలనీలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో చిన్నారి సొంత అన్న కూడా ఉన్నాడు. మూడు రోజుల క్రితం (ఆదివారం) పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ఐదుగురు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. 

నిందితుల్లో ఒకరు ఇంటర్‌ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు, మరో నలుగురు ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు. అత్యాచారం జరిగిన తరువాత చిన్నారితో సహా అందరూ ఏమీ తెలియనట్లు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఆరోజు నుంచి బాలికకు కడుపునొప్పి రావడంతో పాటు అనారోగ్యానికి గురికావడంతో బుధవారం సాయంత్రం చిన్నారి తల్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్‌ పరిశీలించి లైంగిక దాడి జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని విచారించగా.. తాను పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో తన సొంత అన్న, స్నేహితులు కలిసి తనకు తెలియకుండానే ఏదో చేశారని చిన్నారి పోలీసుల ముందు అమాయకంగా చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి పంపారు. మైనర్‌ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)