Breaking News

హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి

Published on Wed, 05/08/2024 - 07:23

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలువురు మృతిచెందారు.

కాగా, హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రింగ్‌ పని కార్మికుల షెడ్‌పై కూలిన రిటైనింగ్‌ వాల్‌. భారీ వర్షానికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఎన్‌డీఆర్‌ఎఫ్‌, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఇక, మృతులను ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇక, ఏపీలో కూడా పిడుగుల కారణంగా ఏడుగురు మృత్యువాడపడ్డారు.  

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలన్నారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)