అవును.. అమ్మే భార్గవికి ఉరేసింది

Published on Wed, 03/20/2024 - 14:10

సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం దండుమైలారంలో కలకలం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసును.. పోలీసులు ఎట్టకేలకు పరువు హత్యగా తేల్చారు. భార్గవి(19)ని తల్లే చంపిందని.. ప్రియుడితో కలిసి కూతురు కనిపించేసరికి భరించలేక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు నిర్ధారించారు.

దండుమైలారం గ్రామానికి చెందిన మోటే ఐలయ్య, జంగమ్మ దంపతులకు కుమార్తె భార్గవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్గవి హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల భార్గవి తల్లిదండ్రులు మేనబావను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె తాను స్థానికంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. అతన్నే పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. 

ఈ క్రమంలో మూడు రోజులపాటు భార్గవి కాలేజీకి కూడా వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. సోమవారం తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సదరు యువకుడు.. భార్గవి ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తెపై తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసిందని, చీరతో ఉరి వేసి హతమార్చింది.

ఈలోపు భర్త, కొడుకు ఇంటికి వచ్చేసరికి స్పృహ కోల్పోయినట్లు నటించి.. కూతురిని ఎవరో చంపేశారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే.. అక్కను తల్లే చంపి ఉంటుందని భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తాను చంపలేదని జంగమ్మ, తన భార్య చంపి ఉండకపోవచ్చని ఆమె భర్త వాదించారు. ఈ క్రమంలో ప్రియుడి పాత్రపైనా పోలీసులు అనుమానాలు మళ్లాయి. అయితే.. తమదైన శైలిలో ఈ కేసును విచారించగా.. చివరకు కూతురిని తానే ఉరేసి చంపిటనట్లు జంగమ్మ అంగీకరించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)