బడే దామోదర్‌ ఎక్కడ?

Published on Sat, 11/22/2025 - 10:07

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన బడే దామోదర్‌ అలియాస్‌ చొక్కారావు ఎక్కడ? ఇటీవల సాగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఆయన వ్యూహం ఏమిటీ? ఓ వైపు ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాడంటుండగా.. మరోవైపు లొంగుబాటు ప్రయత్నం చేస్తున్నాడని వైరల్‌ అవుతోంది? ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, సౌత్‌బస్తర్, ఏఓబీలో కీలకమైన బడే దామోదర్‌ ఎక్కడున్నాడు? ఏం జరుగుతోంది? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇటీవల ములుగు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన పేరిట ఫోన్‌ కాల్స్‌ రావడం, ఓ రాజకీయ నేతను కలవాలని సూచించడం కూడా కలకలం రేపుతోంది. 

దామోదర్‌ వ్యూహం ఏంటో..
ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం కాల్వ లపలి్లకి చెందిన బడే దామోదర్‌ది సీపీఐ (మావోయిస్టు) ఉద్యమ చరిత్రలో ఓ అధ్యాయం. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ 2021 జూన్‌ 21న కొవిడ్‌ బారిన పడి మృతిచెందగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బాధ్యతలను దామోదర్‌కు పార్టీ అప్పగించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో కీలకంగా మారిన ఈయన ఈ ఏడాది జనవరిలో పూజారి కాంకేర్‌ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో వైరలైంది. ఐదారు రోజుల తేడాతో దామోదర్‌ బతికే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ 11 మాసాల వ్యవధిలో మావోయిస్టు పార్టీ నాయకత్వం ఎన్నో ఉత్థానపతనాలను చూసింది. 

అగ్రనేతలు ఎన్‌కౌంటర్లకు గురికావడం.. కేంద్ర కమిటీ స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఆయుధాలతో లొంగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో ఏఓబీ సరిహద్దు మారేడుమిల్లి ఏరియాలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో హిడ్మా సహా 13 మంది మృతిచెందడం... పదుల సంఖ్యలో ముఖ్య నేతలు విజయవాడలో అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించడం ఆ పార్టీ మనుగడకు సవాల్‌గా పరిణవిుంచింది. ఇదే సమయంలో బడే దామోదర్‌ అలియాస్‌ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ తదితరులు సైతం లొంగిపోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటివరకు అధికారికంగా ఎటునుంచి ప్రకటన వెలువడలేదు.

దామోదర్‌ పేరుతో ఫోన్‌ చేస్తున్నదెవరు..?
కాల్వపలి్లకి చెందిన మావోయిస్టు అగ్రనేత బడే దామోదర్‌ పేరిట కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఫోన్లు వస్తుండడం కలకలంగా మారింది. తాను దామోదర్‌ను అంటూ ఫోన్‌ చేస్తున్న సదరు వ్యక్తి.. జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడిని కలిసి డబ్బులు ఇవ్వాలని సూచించడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఇద్దరు అధికార పార్టీ నాయకులు, ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్‌ పేరిట ఫోన్లు రావడం.. ఆ ఫోన్‌లో మాట్లాడిన పలు విషయాలను బహిరంగంగానే మా ట్లాడుకుంటుండటం గమనార్హం. నిత్యనిర్బంధం మధ్య దామోదర్‌ ఎక్కడున్నాడు.. ఎలా ఉన్నాడు.. అన్న చర్చ జరుగుతున్న తరుణంలో దామోదర్‌ వాయిస్‌తో ఫోన్‌లో చేస్తున్నదెవరు? ఒకవేళ దామోదరే అయితే ఎవరిని కలవమన్నారు? అనే అంశాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)