Breaking News

మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి కన్నుమూత

Published on Mon, 10/28/2024 - 05:55

సాక్షి, హైదరాబాద్‌/ నల్లకుంట: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎస్‌.ఇంద్రసేన్‌రెడ్డి (81) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన సోమాజి గూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కళాశాల రోజుల నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఇంద్రసేన్‌రెడ్డి 1960 దశకం మొదట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి యూని యన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

1972లో ఉమ్మడి ఏపీ యూత్‌కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆయన 1975లో జాతీయ యువ జన కాంగ్రెస్‌కు ఎంపికయ్యారు. ఏపీసీసీ ఉపా ద్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇంద్ర సేన్‌రెడ్డి ఏఐసీసీ సభ్యుడిగా, ఏపీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా, టి. అంజయ్య మంత్రివర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, ఏపీఐడీసీ చైర్మన్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. 

సీఎం సంతాపం
మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి మృతి పట్ల ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఎంతో సేవ చేసిన ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)