Breaking News

నా భార్యను ట్రాప్‌ చేశాడు..

Published on Wed, 02/18/2026 - 07:40

హైదరాబాద్‌: నా భార్యను ఓ వ్యక్తి  ట్రాప్‌ చేసి తనవైపు తిప్పుకుని నాపైనే కేసులు పెట్టించారని,  నాకు నా పిల్లలకు న్యాయం జరగాలని ఓ వ్యక్తి పురుగుల మందు తాగుతూ బెదిరింపులకు పాల్పడిన సెల్ఫీ వీడియో మంగళవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..కొత్తగూడెం జిల్లాకు చెందిన లకావత్‌ వెంకన్న , లక్ష్మి దేవి దంపతులు నగరానికి వలస వచ్చి యాప్రాల్‌లోని హరిప్రియ ఎంక్లీవ్‌లో నివాసముంటున్నారు. 

వెంకన్న డ్రైవర్‌గా పని చేస్తుండగా  లక్ష్మి అదే అపార్ట్‌మెంట్‌లోని జైపాల్‌రెడ్డి, అరుణ దంపతుల ఇంట్లో పని చేసేది. ఈ క్రమంలో జైపాల్‌ రెడ్డి  వెంకన్నకు కారు కొనుక్కునేందుకు రూ. 3.50లక్షలు అప్పుగా  ఇచ్చాడు. గత ఆగస్టులో జైపాల్‌రెడ్డి భార్య అరుణతో కలిసి అమెరికా వెళ్లిపోయాడు. ఆ తర్వాత జైపాల్‌రెడ్డి డబ్బులు ఇవ్వాలని వెంకన్నను అడగగా కాలయాపన చేస్తున్నాడు. 

ఆ తర్వాత వెంకన్న పథకం ప్రకారం తన భార్య ఫోన్‌ నుంచి  గత సెప్టెంబర్ లో జైపాల్‌రెడ్డి ఫోన్‌కు ‘బాగున్నావా’ అనే మెసేజ్‌ చేయించి వారి నుంచే డబ్బులు తీసుకోవాలని ప్లాన్‌ చేశాడు. అయితే వెంకన్నపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది,  జైపాల్‌రెడ్డి భార్య అరుణ సైతం ఈ నెల 3న వెంకన్నపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు  చేసుకుని ధర్యాప్తు చేపట్టారు.  

లక్ష్మి వాళ్ల చేతుల్లో మోసపోవద్దు.. 
నాపేరు లకావత్‌ వెంకన్న... సార్‌ .మేము .యాప్రాల్‌లో హరిప్రియ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నాము. నా భార్యను జైపాల్‌రెడ్డి తన వైపు తిప్పుకుని నాపై కేసులు పెట్టిస్తున్నాడు.  జవహర్‌నగర్‌ పీఎస్‌లో అధికారులు వారికే సహకరిస్తున్నారు. అక్కడ నాకు న్యాయం జరగలేదని నా సొంత ఊర్లో వచ్చి కేసు పెట్టా. నాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగడం లేదు.. నా పెళ్లాం పిల్లలు లేనప్పుడు , నేనెందుకు బతకాలి...నేను బతకలేను సార్‌.. నాకు ఎట్లా న్యాయం చేయలేకపోయారు ఎస్పీ సార్‌ .. కనీసం నా పిల్లలకైనా న్యాయం చేయండి.. లక్ష్మి వాళ్ల చేతుల్లో నీవు మోసపోకు , నా పిల్లలను చంపేస్తారు. అంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని చేసిన సెల్పీ వీడియో వైరల్‌గా మారింది.   

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు