Breaking News

సాంప్రదాయ విత్తనాలను కాపాడుకోవాలి

Published on Fri, 02/06/2026 - 19:08

సాక్షి, కడ్తాల్: అంతరించి పోతున్న దేశీయ, సాంప్రదాయ విత్తనాలను కాపాడుకుంటూ, వాటి నిర్వహణను కంపెనీలు, కార్పొరేట్ల గుప్పిట్ల నుంచి రైతు అజమాయిషీలోకి తీసుకు రావాలని తెలంగాణ‌ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పిలుపు నిచ్చారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అది రైతు హక్కు అని తెలిపారు. ఈరోజు బహుళ జాతి కంపెనీలు హైబ్రిడ్ విత్తన వ్యాపారంతో రాష్ట్ర ప్రభుత్వాలను  శాసిస్తున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయ విత్తనాలతోనే వాటికి చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.

శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లి లోని ఎర్త్ సెంటర్ లో సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్), భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ... బహుళ జాతి కంపెనీలు దేశంలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా ఐటీ, మార్కెట్ ఫీజు మినహాయింపు పొందుతున్నాయన్నారు. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను కూడా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు. కలుపు మందులు చాలా విష పూరితమని, అయినా ఎరువుల దుకాణాలలో దొరకడం శోచనీయం అన్నారు.

మనకు వనరులు, అవకాశం ఉన్నప్పటికీ సాంప్రదాయ విత్తనాలను పండించడం లేదని, ఇప్పటికయినా మేల్కొనకపోతే ఒకవంక వాతావరణ మార్పుల దుష్ప్రభావం, మరో వంక బహుళ జాతి కంపెనీల చేతిలో ఇబ్బందుల పాలవుతామని కోదండరెడ్డి హెచ్చరించారు. సాంప్రదాయ విత్తనాల వినియోగానికి, రైతుల హక్కులు కాపాడడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్నారు కోదండ రెడ్డి. అనంతరం విత్తన స్టాళ్లను ఆయన ప్రారంభించి, సందర్శించారు.


        
ఈ కార్యక్రమంలో సీజీఆర్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ.. ఆహారం లోనే ఆరోగ్యం ఉందని, దురదృష్టవశాత్తు ఆ ఆహారం కల్తీ అయ్యిందన్నారు. రాబోయే తరాల కోసం సాంప్రదాయ విత్తనాలను రక్షిద్దామని పిలుపు నిచ్చారు.

సీజీఆర్ వైస్ ప్రెసిడెంట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ... మానవ సమాజానికి రైతు చేస్తున్న సేవలో విత్తన పండుగ కూడా ఒకటని అన్నారు. గత ఏడాది CGR నిర్వహించిన విత్తన పండుగలో 50 స్టాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 75 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఆహార వ్యవస్థలో తీవ్ర మైన మార్పులు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా జన్యు సంపద ప్రమాదంలో పడిందని, వాటిని కాపాడటమే విత్తన పండుగ ప్రధాన ఉద్దేశ మని పర్యావరణ వేత్త, కార్యక్రమ కన్వీనర్ దొంతి నర్సింహారెడ్డి తెలిపారు.

రైతు కమిషన్ సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... కల్తీ మందులు, విత్తనాలతో పక్షి జాతులు అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ... సమస్య చాలా తీవ్రంగా ఉందని, జీవ వైవిధ్యం నశించి పోతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు తలవంచుతున్నాయని విమర్శించారు.

‘నాబార్ఢ్’ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ... రాష్ట్రం లోని 13 జిల్లాలలోని 180 స్కూళ్ళలో ట్రెడిషనల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు సాంప్రదాయ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న సీజీఆర్ కార్యక్రమం ‘వైఇఎల్పీ’కి నాబార్డు మద్దతిస్తున్నట్టు చెప్పారు. సాంప్రదాయ విత్తనాల వాడకం కోసం సీజీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. CGR కు తమ సహకారం ఉంటుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ కన్వీనర్ జాకోబ్, జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

చ‌ద‌వండి: సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)