Breaking News

సీఎం రేవంత్‌పై ఫిర్యాదును పరిశీలిస్తున్నాం: ఎస్‌ఈసీ రాణి కుమిదిని

Published on Wed, 12/10/2025 - 15:45

సాక్షి, హైదరాబాద్‌: రేపటి మొదటి దశ సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ జరిగినట్లు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాణి కుమిదిని దేవి ప్రకటించారు. పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆమె బుధవారం మీడియాకు వెల్లడించారు.  

రేపు మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌటింగ్ ఉంటుంది. రేపు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక లేదంటే ఎల్లుండి ఉంటుంది. ఇప్పటికే అబ్జర్వర్ల, మైక్రో అబ్జార్వుల నియామకం జరిగింది. ఓటర్ స్లిప్ల్ లు పంపిణి దాదాపు పూర్తి అయింది. సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తి అయిందని వెల్లడించారామె. 

సీఎం రేవంత్ రెడ్డిపై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు పైనా ఆమె స్పందించారు. ఆ ఫిర్యాదును ఎన్నికల సంఘం ఎంసీసీ(Model Code of Conduct) కమిటీకి పంపాం. ఆ కమిటీ నివేదిక తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. రెండు సంవత్సరాల ప్రజా పాలన ఉత్సవాల కోసం అనుమతి అడిగారు. మేం అనుమతి ఇచ్చాం అని అన్నారామె. 

👇

  • మొత్తం మండలాలు నోటిఫై: 189
  • గ్రామ పంచాయతీలు నోటిఫై: 4236
  • వార్డులు నోటిఫై: 37,440
  • పోలింగ్ స్టేషన్లు: 37,562
  • ఫేజ్–1 ఓటర్ల సంఖ్య: 56,19,430
  • పురుషులు: 27,41,070
  • మహిళలు: 28,78,159
  • ఇతరులు: 201

👇

పోలింగ్‌కు వెళ్లే GPలు: 3,834

పోలింగ్‌కు వెళ్లే వార్డులు: 27,628

సర్పంచ్ అభ్యర్థులు: 12,960

వార్డ్ మెంబర్ అభ్యర్థులు: 65,455

ROలు నియామకం: 3,591

పోలింగ్ సిబ్బంది: 93,905

మైక్రో ఆబ్జర్వర్లు: 2,489 (మూడూ దశలకు)

వెబ్‌కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు: 3,461

బ్యాలెట్ బాక్సులు అందుబాటులో: 45,086
 

👉ఇక ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఉల్లంఘన కేసులు.. సీజ్‌లు తదితర వివరాలను ఏడీజీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 

  • ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు: 3,214 FIRలు
  • ప్రివెంటివ్ యాక్షన్‌లో బౌండ్ ఓవర్ వ్యక్తులు: 31,428
  • డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ ఆయుధాలు: 902
  • సీజ్ చేసిన నగదు: ₹1,70,58,340
  • సీజ్ చేసిన మద్యం: ₹2,84,97,631
  • డ్రగ్స్ / నార్కోటిక్స్: ₹2,22,91,714
  • విలువైన లోహాలు / ఆభరణాలు: ₹12,15,500
  • ఇతర వస్తువులు: ₹64,15,350

మొత్తం సీజ్ విలువ: ₹7,54,78,535

రేపు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ డబుల్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)