Breaking News

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. 60 ప్రత్యేక రైళ్లు

Published on Fri, 11/07/2025 - 14:15

సాక్షి, హైదరాబాద్‌: శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. 60 శబరిమల ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. బుకింగ్స్ ఇవాళ (నవంబర్‌ 7, శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. శబరిమల యాత్రికుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఈ యాత్రా సీజన్‌లో 60 ప్రత్యేక రైళ్లను నడపనుంది. యాత్రికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, తమ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

ఈ ప్రత్యేక రైళ్లు మచిలీపట్నం, నర్సాపురం, చర్లపల్లి నుంచి కొల్లం వరకు నడుస్తాయి. రేణిగుంట, గూడూరు, గుంటూరు మార్గాల మీదగా నడవనున్నాయి. ఈ సేవలు నవంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు అందుబాటులో ఉంటాయని ఎస్‌సీఆర్‌ ప్రకటించింది.

రైలు నంబర్‌ 07107: (చర్లపల్లి నుంచి కొల్లాం వరకు) నవంబర్‌ 17, 24.. డిసెంబర్‌ 1,8,15,22,29.. జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి బయలుదేరి.. మర్నాడు కొల్లాం చేరుకుంటాయి. పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయి.
రైలు నంబర్‌ 07108: (కొల్లాం నుంచి చర్లపల్లి వరకు) నవంబర్‌ 19, 26.. డిసెంబర్‌ 3,10,17,24,31 తేదీల్లో.. జనవరి 7,14,21 తేదీల్లో కొల్లా నుంచి బయలుదేరి.. మర్నాడు చర్లపల్లి చేరుకుంటాయి.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)