Breaking News

దుబాయ్‌లో భర్త .. స్కూల్‌ ప్రిన్సిపాల్‌కి కాల్‌ చేస్తున్న యువకుడు

Published on Mon, 03/10/2025 - 08:54

ఫిలింనగర్‌ (హైదరాబాద్‌): ‘ఫోన్‌ కాల్‌ లిఫ్ట్‌ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్‌ చేస్తా’ అంటూ వివాహితను బెదిరిస్తున్న యువకుడిపై ఫిలింనగర్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకి సమతాకాలనీలో నివసించే వివాహిత (32) స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కాగా, 2016 నుంచి భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. గత ఏడాది తన స్కూల్‌లో అడ్మిషన్లకు సంబంధించి ఇన్‌స్ట్రాగాంలో ప్రకటన పోస్ట్‌ చేసింది. షేక్‌ వసీం అనే యువకుడు ఆమె ఇన్‌స్ట్రాగాం అకౌంట్‌ను ఫాలో అవుతూ ఆమె ఫోన్‌ నెంబర్‌ను అడ్మిషన్‌ కావాలంటూ అడిగి తెలుసుకున్నాడు. 

తరచూ ఫోన్‌ చేస్తుండడంతో ఆమె లిఫ్ట్‌ చేయలేదు. దీంతో స్కూల్‌లో సిబ్బంది నుంచి ఆమె పర్సనల్‌ నెంబర్‌ను కూడా సేకరించాడు. అప్పటి నుంచి స్కూల్‌కు, ఆమె ఇంటికి తిరుగుతూ 24 గంటలూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో ఆమె పర్సనల్‌ నెంబర్‌ను కూడా లిఫ్ట్‌ చేయడం ఆపేసింది. ఈ నేపథ్యంలోనే షేక్‌ వసీం ర్యాపిడో డ్రైవర్‌ను బుక్‌ చేసుకుని ఆమె ఇంటికి పంపించి పార్శిల్‌ ఇస్తారు.. తీసుకురా అని చెప్పసాగాడు. ఆమె ఇంటికి వెళ్లిన ర్యాపిడో డ్రైవర్‌ను ఫోన్‌ ఆమెకు ఇవ్వు మాట్లాడతానంటూ వేధించడం మొదలుపెట్టాడు. 

గత ఏడు నెలల నుంచి నిందితుడి వేధింపులు రోజురోజుకు పెరిగాయి. ఇంటి చుట్టూ, స్కూల్‌ చుట్టూ తిరుగుతూ ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మరింత రెచ్చిపోయిన నిందితుడు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్‌ చేస్తానంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్‌ పోలీసులు నిందితుడిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 78(2), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)