Breaking News

శంషాబాద్‌లో స్కూల్‌ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

Published on Thu, 12/25/2025 - 11:22

సాక్షి, శంషాబాద్‌: శంషాబాద్‌ దగ్గర స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ముందున్న వాహనాన్ని తప్పించబోయి స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులు గాయపడ్డారు. దీంతో, రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్‌ నుంచి హైదరాబాద్‌లోని జలవిహార్‌కు పిల్లలను పిక్నిక్‌కు తీసుకెళ్తున్న రిషి స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ముందున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం కారణంగా పలువురు విద్యార్థులు గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా శంషాబాద్‌ రూట్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

అయితే, ప్రమాదం జరిగిన సమయంలో వనపర్తి పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన కాన్వాయ్‌ను ఆపి బస్సు దగ్గరికి వెళ్లారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తీయించారు. హైదరాబాద్ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్‌ కావడంతో మంత్రి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడ్డ విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రమాదానికి గురై భయబ్రాంతులకు లోనైన విద్యార్థులకు మంత్రి ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని షాద్ నగర్ డాక్టర్లకు ఫోన్ చేసి చెప్పారు. విద్యార్థులకు దగ్గరుండి అన్ని చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)