Breaking News

‘అన్న’లు నిర్మించిన పాఠశాల

Published on Fri, 01/24/2025 - 04:40

సాక్షి, సిద్దిపేట: ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి అన్న వార్తలు విన్నప్పుడల్లా ఆ ఊరి ప్రజలు ఉలిక్కిపడతారు. 30 ఏళ్ల కిందట బాలకార్మికులుగా మగ్గిపోతున్న తమ బిడ్డల కోసం బడి కట్టించిన ఆ అన్నలను తలుచుకుని కలవరపడుతుంటారు. తెలంగాణలో నక్సల్స్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో నక్సల్స్‌ సిద్దిపే ట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో పేద పిల్లల కోసం పాఠశాలను నిర్మించారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల అదే.

గ్రామస్తుల విజ్ఞప్తితో.. 
1991 వరకు ఈ గ్రామంలో పాఠశాల పూరి గుడిసెలో కొనసాగింది. ఆ సమయంలో దుంపలపల్లికి వచ్చిన పీపుల్స్‌వార్‌ నాగన్న దళానికి పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. దీంతో మూడు గదులను నిర్మించాలని నక్సల్స్‌ నేతలు నాగన్న, నగేష్, రామన్న, జనార్దన్‌లు నిర్ణయించారు. 1991లో పనులు ప్రారంభించి, 1995 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ బడి నిర్మాణానికి సుమారు రూ.5 లక్షల వరకు వెచ్చించినట్లు తెలిసింది. బడి నిర్మాణానికి గ్రామస్తులంతా శ్రమదానం చేశారు.  

కూల్చివేతను అడ్డుకున్న స్థానికులు
నక్సలైట్లు నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరటంతో వాటి స్థానంలో కొత్త భవనం నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మన ఊరు–మన బడి పథకంలో భాగంగా జీ ప్లస్‌ 1లో నాలుగు గదుల నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం రూ.51 లక్షలు మంజూరు చేశారు. దీంతో పాత గదులను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ గదులు నక్సల్స్‌కు గుర్తుగా ఉండాలని వాదించినట్లు తెలిసింది. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు.. పాత బడి ఎదురుగా కొత్త పాఠశాల నిర్మాణం ఇటీవల ప్రారంభమైంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు బోధన సాగుతోంది. ఈ స్కూళ్లో ఇప్పటివరకు 943 మంది చదువుకున్నారు. ప్రస్తుతం 64 మంది (బాలురు 36, బాలికలు 28) విద్యార్థులు ఉన్నారు.

కూల్చవద్దు అంటున్న స్థానికులు
పాత భవనం కూల్చివేసి వాటి స్థానంలో నాలుగు తరగతి గదులు నిర్మించాలని మన ఊరు–మన బడి పథకంలో నిర్ణయించారు. పనులు ప్రారంభించే సమయంలో పాత గదులు కూల్చవద్దని స్థానికులు అడ్డుకున్నారు. ఎందుకని అడిగితే అప్పట్లో నక్సలైట్‌లు ఆ గదులను నిర్మించారని చెప్పారు. – నాగేశ్వర్‌ రావు, ప్రధానోపాధ్యాయుడు

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)