Breaking News

పాలు ఎందుకు ఇవ్వడం లేదు? 

Published on Fri, 01/06/2023 - 02:25

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ‘మూడు నెలలుగా పాలు లేవ్‌’అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. గురువారం ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె ప్రత్యేకంగా సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మూడు నెలలుగా పాల సరఫరా నిలిచినందుకు గల కారణాలపై ఆరా తీశారు.

పాల పంపిణీ నిలిచిపోవడంతో పిల్లలకు పౌష్టికలోపాలను అధిగమించే కార్యక్రమం నీరుగారుతుందని చెబుతూ.. తక్షణమే పాల సరఫరా పునరుద్ధరించాలని ఆమె ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, టెండరు ఖరారు, కాంట్రాక్టరు ఎంపిక అయ్యే వరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  

అందుకే పాలు సరఫరా చేయలేకపోయాం... కేఎంఎఫ్‌ వివరణ 
ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం వల్లే అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు పంపిణీ  నిలిచిపోయిందని కర్ణాటక కోఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌) లిమిటెడ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న తమ సంస్థ గతేడాది సెప్టెంబర్‌ నెల వరకు పూర్తిస్థాయిలో పక్కాగా సరఫరా చేసినట్లు వివరించింది.

గతేడాది సెప్టెంబర్‌తో కాంట్రాక్టు ముగిసిందని, కానీ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ వాఖ ప్రత్యేక ఆదేశాలతో పాల పంపిణీ కొనసాగించాలని నిర్ణయించినట్లు వివరించింది. కానీ పాడి పశువులు పెద్ద సంఖ్యలో లంపిస్కిన్‌ వ్యాధి బారిన పడడంతో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని, దానికితోడు గత నవంబర్, డిసెంబర్‌లలో తీవ్ర వర్షాలు కురవడంతో పాల రవాణా పడిపోయిందని, దీంతో పాల కేంద్రాలకు కోటా రాలేదని వివరించింది. త్వరలోనే పాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని కేఎంఎఫ్‌ వివరించింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)