Breaking News

గంజాయిపై శాటిలైట్‌!

Published on Mon, 08/19/2024 - 04:58

సాక్షి, హైదరాబాద్‌: ‘నిషా ముక్త్‌ తెలంగాణ’లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. గంజాయితోపాటు డ్రగ్స్‌కు చెక్‌ చెప్పడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) తరహాలో ఎడ్రిన్‌ మ్యాప్స్, మ్యాప్‌ డ్రగ్‌ యాప్‌ టెక్నాలజీని వాడుతోంది. వీటికి సంబంధించి టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య ట్రైనింగ్‌ ఫర్‌ ట్రైనర్స్‌ విధానంలో నలుగురు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.  

మండలాలు తెలిసినా ప్రాంతాలపై అస్పష్టత 
తెలంగాణతోపాటు ఉత్తరాదిలోని అనేక ప్రాంతాలకు సరఫరా అవుతున్న గంజాయిలో అత్యధిక శాతం ఆంధ్ర–ఒడిశా సరిహద్దులతో (ఏఓబీ) పాటు విశాఖ ఏజెన్సీ నుంచే వస్తోంది. అక్కడి వ్యాపారులు వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తూ రైతులను ప్రలోభాలకు గురి చేసి గంజాయి పంట పండించేలా ప్రోత్సహిస్తున్నారు. ఏజెన్సీలోని ఏఏ మండలాల్లో గంజాయి సాగు జరుగుతోందో పోలీసులకు తెలుసు.. కానీ ఏ ప్రాంతంలో ఉందో కచి్చతంగా తెలుసుకోవడం సాధ్యం కావట్లేదు. ఏజెన్సీతోపాటు ఏఓబీలో సైతం మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో గంజాయి పంటను గుర్తించేందుకు కూంబింగ్‌ తరహా ఆపరేషన్స్‌ చేపట్టడానికి పోలీసులు సాహసం చేయలేకపోతున్నారు. ఇదే అదనుగా ఈ పంట పండించే వాళ్లు నానాటికీ విస్తరిస్తున్నారు.

ఉపగ్రహ ఛాయా చిత్రాలతో స్పష్టత
కొన్నేళ్లుగా గంజాయిపై రాష్ట్ర పోలీసు విభాగాలతోపాటు ఎన్సీబీ సైతం దృష్టి పెట్టింది. తక్కువ ధరకు తేలిగ్గా లభిస్తూ వేగంగా విస్తరిస్తున్న ఈ మాదకద్రవ్యం పండించడం, విక్రయించడం, రవాణా, వినియోగం తదితరాలు లేకుండా చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. అందులో గంజాయి పంటను గుర్తించేందుకు శాటిలైట్‌ సాంకేతికత వాడకం ప్రధానమైంది. దీనికోసం ఎన్సీబీ అధికారులు కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోని బాలానగర్‌ ప్రాంతంలో ఉన్న అడ్వాన్స్‌ డేటా ప్రాసెసింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎడ్రిన్‌) సహాయం తీసుకుంటున్నారు.

ఎడ్రిన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం... గంజాయి పండించే ప్రాంతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను ఎన్సీబీకి ఇస్తుంది. వీటిని విశ్లేషించే అధికారులు ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు, పరిపాలన విభాగాలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. టీజీ ఏఎన్‌బీ కూడా ఇదే మాదిరిగా చేయడంతోపాటు ఆ ప్రాంతాలకు సంబంధించిన రూట్లలో ప్రత్యేక సీసీ కెమెరాలు, చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయనుంది.

మ్యాప్‌ డ్రగ్‌తో మరింత సమన్వయం 
మాదకద్రవ్యాలను ఓ ప్రాంతంలో తయారు చేయడం, పంపడం జరిగితే... అవి ఒక ప్రాంతం మీదుగా ఇంకోచోటుకు చేరి అక్కడ వినియోగం అవుతుంటాయి. ఏజెన్సీలో గంజాయి, హష్‌ ఆయిల్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లో నల్లమందు, మరికొన్ని చోట్ల ఎఫిడ్రిన్‌... ఇలా తయారై దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. కొకైన్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్డీ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ విదేశాల నుంచి అక్రమ రవాణా అయి, గోవా, బెంగళూరు, ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు చేరుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే గంజాయితోపాటు ఇతర డ్రగ్స్‌ కట్టడికి సమన్వయం చాలా కీలకం. ఏఏ ప్రాంతాల్లో ఏ డ్రగ్స్‌ ఉంటున్నాయి? ఎవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఏ మార్గాల్లో రవాణా అవుతున్నాయి? అనే విషయాలను తెలుసుకుంటేనే సమన్వయం సాధ్యం. దీనికోసం మ్యాప్‌ డ్రగ్‌ పేరుతో ఎన్సీబీ ప్రత్యేక యాప్‌ రూపొందించింది. ఈ యాప్‌ను అధికారికంగా వినియోగించుకోవడానికి టీజీ ఏఎన్‌బీకి అనుమతి ఇచ్చింది. దీని వినియోగంపై అధికారులకు శిక్షణ సైతం పూర్తయింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)