ప్రియుడి మోజులో భర్తను అంతమొందించింది

Published on Sat, 08/30/2025 - 07:48

చైతన్యపురి: ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అడ్డు తొలగించుకునేందుకు భర్తను హతమార్చిన ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి వివరాల ప్రకారం.. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన  జెల్లెల శేఖర్‌  (40) భార్య  చిట్టితో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌ కోదండరాంనగర్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–7లో నివసిస్తున్నాడు. 16 ఏళ్లక్రితం వీరికి వివాహం కాగా ఓ కొడుకు, కూతురు ఉన్నారు. శేఖర్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం చిట్టి 100కు డయల్‌ చేసి తన భర్త నిద్రలో చనిపోయాడని సమాచారం ఇవ్వగా ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

మృతదేహాన్ని పరిశీలించగా పెదాలపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి హతమార్చినట్లు ఒప్పకుంది. స్థానికంగా ఉండే హరీష్‌తో చిట్టి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో శేఖర్‌ పలుమార్లు మందలించాడు. ఎలాగైనా భర్త అడ్డుతొలగించుకోవాలకున్నారు. గురువారం రాత్రి శేఖర్‌ నిద్రించిన తర్వాత హరీష్‌ గొంతుపట్టుకోగా డంబెల్స్‌తో చిట్టి దాడి చేసినట్లు తెలుస్తుంది 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)