Breaking News

బతుకమ్మ చీరెలొస్తున్నాయ్‌..

Published on Mon, 09/15/2025 - 12:09

జగిత్యాల: స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా కానుకగా చీరలను పంపిణీ చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఎన్ని సంఘాలున్నాయి..? ఎంతమంది మహిళ సభ్యులు ఉన్నారు..? అనేది లెక్కలు తీశారు. జిల్లాకు మొత్తం 2,39,950 చీరలు రానున్నాయి. గతంలో ప్రభుత్వం ప్రతి దసరాకు బతుకమ్మ చీరల పేరిట పంపిణీ చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా బతుకమ్మ పండగకు చీరలు ఇవ్వాలని నిర్ణయించింది.

 బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యేనాటికి మహిళాసంఘాల సభ్యులకు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో గోదాములను గుర్తించి నియోజకవర్గాలుగా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రేవంతన్న కానుకగా ప్రతి సంఘం సభ్యులకు చీరెలు అందించనున్నారు. మరో రెండుమూడు రోజుల్లో చీరలు జిల్లాకు రానున్నట్లు డీఆర్డీఏ శాఖ అధికారులు తెలిపారు. మెప్మా సిబ్బందికి పంపిణీ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని మూడు నియోజకవరాల్లో గోదాం పాయింట్లను ఏర్పాటు చేశారు.

మహిళలకు అందిస్తాం
ప్రతి సంఘం సభ్యురాలికి బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు అందించనున్నాం. జిల్లాకు 2,39,950 చీరలు రానున్నాయి. నిల్వ చేసేందుకు గోదాం పాయింట్లు గుర్తించాం. త్వరలోనే మహిళలకు అందించేలా చర్యలు తీసుకుంటాం.    
– రఘువరణ్, డీఆర్డీఏ పీడీ 

 

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)