Breaking News

ప్రాణం తీసిన చీర గొడవ

Published on Thu, 01/16/2025 - 07:44

శామీర్‌పేట్‌: చీర కారణంగా చెలరేగిన వివాదం తల్లి, కుమార్తె మధ్య ఘర్షణకు దారితీయగా అడ్డు వచ్చిన తండ్రిని కుమారుడు హత్య చేసిన సంఘటన మంగళవారం రాత్రి శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లా, శామీర్‌పేట, పెద్దమ్మ కాలనీలో హన్మంతు (50), పెద్దమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

బుధవారం తల్లి, కుమార్తెకు చీర విషయమై గొడవ జరిగింది. ఈ విషయంలో తండ్రి హన్మంతు, పెద్దకొడుకు నర్సింహ జోక్యం చేసుకోవడంతో వారి  మధ్య ఘర్షకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న నర్సింహ తండ్రిపై రోకలిబండతో దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట పోలీసులు పంచనామా నిర్వహించారు. 

నిందితుడి రిమాండ్‌... 
శామీర్‌పేట సీఐ శ్రీనాథ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. బుధవారం అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)