Breaking News

Saraswati Pushkaralu 2025: సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌

Published on Thu, 05/15/2025 - 15:43

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం పుష్కర శోభ సంతరించుకుంది. ఉదయం 5 గంటల 44 నిమిషాలకు మాధవానంద సరస్వతీ చేతుల మీదుగా మొదటి పుష్కర స్నానం లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు మొదటిసారిగా జరుగుతున్నాయి. నేటి  నుంచి మే 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరుగనున్నాయి.

ఇవాళ కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పర్యటించారు. 17 అడుగుల సరస్వతీదేవి ఏకశిలా విగ్రహాన్ని నదీ తీరంలో సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎంతో పాటు మంత్రుల పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వరుణ్ని దర్శించుకున్నారు. అనంతరం సరస్వతీ హారతి కార్యక్రమానికి హాజరయ్యారు.

పుష్కరాల నిర్వహణ కోసం రూ.35 కోట్లతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పుష్కర ఘాట్లు, మంచినీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుధ్యానికి ప్రాధాన్యతనిచ్చిన దేవాదాయశాఖ.. ఎండల తీవ్రత ఉన్నందున టెంట్లు, పందిర్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమ శోభ సంతరించుకుంది. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)