Breaking News

వార్డు మెంబర్‌గా ఓడి.. ఎమ్మెల్యే, మంత్రిగా..

Published on Fri, 11/28/2025 - 12:48

మోర్తాడ్‌(బాల్కొండ): సొంత గ్రామానికి సర్పంచ్‌గా ఎంపిక కాలేకపోయినా ఆర్మూర్‌ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, వివిధ శాఖలకు మంత్రిగా, ఒకసారి జడ్పీ చైర్మన్‌గా ఎంపికైన శనిగరం సంతోష్‌రెడ్డి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నారు. భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్‌కు చెందిన సంతోష్‌ రెడ్డి 1971లో సర్పంచ్‌గా ఎంపిక కావాలనే ఉద్దేశ్యంతో వార్డు స్థానానికి పోటీ చేశారు. అప్పట్లో వార్డు సభ్యునిగా ఎంపికైన వారే మెజార్టీ సభ్యుల మద్దతుతో సర్పంచ్‌ పదవిని పొందేవారు. 

అలా వార్డు సభ్యునిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. గ్రామ రాజకీయాలు కలిసి రాకపోవడంతో ఇందిరా కాంగ్రెస్‌ పార్టీ లో క్రియాశీలక నేతగా గుర్తింపు పొంది 1978లో తొలిసారి ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 1989లో మరోసారి ఎమ్మెల్యేగా ఎంపికై ఆర్థిక శాఖ, రోడ్లు భవనాలు, భారీ పరిశ్రమల శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2002లో భీమ్‌గల్‌ జడ్పీటీసీగా గెలిచి బీఆర్‌ఎస్‌ తరఫున జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎంపికయ్యారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా కొన్ని నెలలపాటు పనిచేశారు.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)