Breaking News

సంక్రాంతి ఎఫెక్ట్: విజయవాడ హైవేపై కదలని వాహనాలు

Published on Fri, 01/12/2024 - 19:44

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. హయత్ నగర్ నుంచి కొత్తగూడెం వరకు భారీగా ట్రాఫిక్ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు.

నగరవాసులంతా సొంత ప్రాంతాలకు క్యూ కట్టడంతో హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అవుతుంది. లక్షలాది కుటుంబాలు  సంక్రాంతి పండుగకు  తమ స్వంత ఊర్లకు పయనమయ్యారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ కనిపిస్తోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు.

టోల్‌ ప్లాజాలు దాటేందుకు సుమారు 15 నిమిషాలకుపైనే టైం పడుతోంది. హైదరాబాద్‌కు సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిపోయాయి. రద్దీ దృష్ట్యా అధికారులు అదనంగా 10 గేట్లను తెరిచారు. రానున్న రెండు రోజుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుపుతున్నారు.

ఇదీ చదవండి: ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు