Breaking News

ఘుమఘుమల సంక్రాంతి

Published on Mon, 01/13/2025 - 02:40

సత్తుపల్లిటౌన్‌: తెలుగురాష్ట్రాల ప్రజలకు ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. అయితే, సంక్రాంతి అంటేనే ముగ్గులు, గాలిపటాలు, గంగిరెద్దులతో పాటు పిండి వంటలూ గుర్తుకొస్తాయి. నోరూరించే పిండి వంటల కోసం చిన్నాపెద్ద ఎదురుచూస్తుంటారు. ఖరీఫ్‌ పంటల డబ్బు చేతికి వచ్చేవేళ పండుగ సందడి మొదలవుతుంది. వారం ముందు నుంచే ఇంటింటా పిండి వంటలు చేస్తూ మహిళలు, యువతులు బిజీబీజీ అయ్యారు. అరిసెలు, గారెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు, బూందీ లడ్డు, గవ్వలు, సున్నుండలు, చక్రాలు, కారపుపూస ఇలా రకరకాల పిండి వంటల తయారీతో వీధులు ఘుమఘుమలాడుతున్నాయి. ఆధునిక యువతకు వారి అమ్మలు దగ్గరుండి పిండి వంటలు తయారు చేయటం నేర్పిస్తున్నారు.  

ఇరుగుపొరుగు వారితో కలిసి.. 
సంక్రాంతి పండుగకు వారం, పదిరోజుల ముందు నుంచే పల్లె, పట్టణంలోని ఇళ్లల్లో పిండి వంటల తయారీ మొదలవుతుంది. వీటిని ఒక్కరే చేయటం సాధ్యం కాదు కాబట్టి ఆడపడుచులంతా ఇరుగుపొరుగు బంధువుల సాయంతో పిండి వంటలు చేస్తారు. ఒకరోజు పక్కింట్లో.. మరోరోజు ఎదురింట్లో కబుర్లు చెప్పుకుంటూ పిండివంటలు తయారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది సమష్టి జీవన విధానానికి తార్కాణంగా నిలుస్తోంది.

సంబురంగా చేసుకుంటాం.. 
సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరం ఒకచోట కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ పిండివంటలు చేసుకుంటాం. వీధిలో ఒకరి తర్వాత ఒకరు ఇళ్లకు వెళ్లి పిండి వంటలు చేస్తాం. రకరకాల పిండి వంటలు చేసుకోవటం ఈ పండుగ ప్రత్యేకం.  – తోట జానకి, సత్తుపల్లి 

ఇది అరిసెల పండుగ  
ఏటా సంక్రాంతి పండుగకి అరిసెలు ఎక్కువగా చేస్తుంటాం. పంటలు చేతికి వస్తాయి కాబట్టి అన్ని రకాల వంటలు చేసుకునే వీలు ఉంటుంది. ఈ పిండి వంటలలో పోషకాలు ఉంటాయి. లడ్డూలు, చక్రాలు వంటివి చేసుకుంటాం. – సుబ్బలక్ష్మా, సత్తుపల్లి

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)