Breaking News

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ వంగా, సీఎం రేవంత్ ట్వీట్లు

Published on Sat, 09/19/2026 - 23:39

సాక్షి,వరంగల్: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పేరు పెట్టే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త ఎయిర్‌పోర్టుకు పేరు సూచించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా కోరగా.. దానికి టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్పందించారు.

సందీప్‌రెడ్డి తన సొంత ప్రాంతమైన వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు కానుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA)’, ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)’ అంటూ పేర్లను సూచించారు. వరంగల్ చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఎయిర్‌పోర్ట్ పేరు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

దాంతో సందీప్‌రెడ్డి వంగా ట్వీట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి “That’s the spirit” అంటూ స్పందించారు. ప్రస్తుతం రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో సందీప్‌రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాంతో సీఎం రిప్లైలో 'స్పిరిట్' అనే పదం ఉండటం సినీ అభిమానుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది.
 

మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ నెల 2న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి భూసేకరణ పూర్తయి, భూమిని ఏఏఐకి అప్పగించినట్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి డిసెంబరులో ఎయిర్‌పోర్టు పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)