Breaking News

మేడిగడ్డలో సిరుల మేట!

Published on Thu, 06/20/2024 - 00:57

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ‘మేడిగడ్డ బ్యారేజీ’ రాష్ట్ర ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిపించబోతోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుక మేటలు బయట పడ్డాయి. దీంతో వీటిని తవ్వి ఇసుకను విక్రయించడం ద్వారా భారీఎత్తున ఆదాయాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మేడిగడ్డలో బయటపడిన ఇసుక నిల్వల ద్వారా ఖజానాకు రూ.800 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశమున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 

తొలిదశలో రూ.380 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకునేలా 14 బ్లాక్‌లను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)కు అప్పగించారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్ల షెడ్యూల్‌ను ప్రకటించిన టీజీఎండీసీ జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే మరిన్ని బ్లాక్‌ల నుంచి ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ ఇసుక లభ్యతపై ఇప్పటికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు (డీఎల్‌ఎస్‌సీ) ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇసుక వెలికితీతకు ఇతరత్రా ఎలాంటి ఆటంకాలు లేకుంటే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుందని టీజీఎండీసీ లెక్కలు వేస్తోంది. 

వెలికితీతకు 18–24 నెలల గడువు 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద  సుమారు రూ.800 కోట్ల విలువైన సుమారు 1.92 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఇసుక మేట వేసినట్లు డీఎల్‌ఎస్‌సీ గుర్తించింది. అయితే ప్రస్తుతానికి రూ.380 కోట్ల విలువైన 92.77 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక వెలికితీత సాధ్యమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇసుక వెలికితీత, స్టాక్‌ యార్డుకు చేరవేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ‘ఇ ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌’ ద్వారా టీజీఎండీసీ కాంట్రాక్టర్లను ఎంపిక చేయనుంది. 

ఈ నెల 25 వరకు టెండర్లు స్వీకరించి, వచ్చే నెల 3న తెరిచేలా సంస్థ ఇప్పటికే టెండర్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. మహదేవ్‌పూర్‌ మండలంలోని 14 బ్లాక్‌ల నుంచి ఇసుకను వెలికితీస్తారు. బెగ్లూరు, ఎలే్కశ్వరం, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్‌ పరిధిలో ఈ బ్లాక్‌లు ఉన్నాయి. గోదావరి నదికి ఎగువ నుంచి వచ్చే వరద, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇసుక వెలికితీతకు 18 నుంచి 24 నెలల గడువును టీజీఎండీసీ నిర్దేశించింది.  

అన్నారం, సుందిళ్ల ఇసుకతో రూ.500 కోట్ల ఆదాయం! 
మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఉన్న ఇసుక మేటల పరిమాణాన్ని గుర్తించడంపై డీఎల్‌ఎస్‌సీలు దృష్టి సారించాయి. సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఎల్‌ఎస్‌సీ సభ్యులుగా ఉన్న రెవెన్యూ, పంచాయతీ, భూగర్భ జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, భూగర్భ వనరుల విభాగాలకు చెందిన అధికారులు ఇప్పటికే ఈ బ్యారేజీలను సందర్శించినట్లు సమాచారం. రెండు బ్యారేజీల్లోని ఇసుకతో మరో రూ.500 కోట్ల ఆదాయం లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డీఎల్‌ఎస్‌సీల నుంచి నివేదికలు అందిన తర్వాత వీటికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియను ప్రారంభిస్తామని టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)