Breaking News

అత్యవసర మార్గం లేకే సహాయక చర్యల్లో జాప్యం

Published on Fri, 02/28/2025 - 05:44

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సొరంగాల నిర్మాణంలో అత్యవసర మార్గాలను నిర్మిస్తారని.. కానీ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు అది లేకపోవడమే ఇటీవల జరిగిన ప్రమాదంలో 8 మంది ఆచూకీ దొరకకపోవడానికి కారణమని జాతీయ స్థాయిలో టన్నెల్‌ ప్రమాదాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించిన నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గురువారం ఎస్‌ఎల్‌బీసీ క్యాంపు సైట్‌ వద్దకు చేరుకున్న ఆర్మీ వెస్టర్న్‌ కమాండెంట్‌ కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా, బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) మాజీ అదనపు డీజీ కె.పి. పురుషోత్తం ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.

భూగర్భంలో 43 కి.మీ. పొడవున నీటిని సరఫరా చేసే సొరంగం దేశంలోకెల్లా ఎస్‌ఎల్‌బీసీ ఒక్కటేనన్నారు. నేషనల్‌ హైవేలు, రైల్వేలైన్లు, సముద్రమార్గాలను భూగర్భంలో నిర్మించినప్పటికీ నీటి సరఫరా కోసం అంతదూరంపాటు చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని పేర్కొన్నారు. అయితే ఈ నిర్మాణం అత్యంత క్లిష్టమైనదని వారు అభిప్రాయపడ్డారు.

టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం) టెక్నాలజీతో సాగే నిర్మాణం మంచిదే అయినప్పటికీ.. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం నొక్కి చెప్పిందన్నారు. ప్రమాదంలో కార్మికులు, ఇంజనీర్లపై మట్టిపెళ్లల శిథిలాలు పడి ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. కార్మికులు గల్లంతైన చోట జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో ఒకట్రెండు రోజుల్లో ఫలితం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)