Breaking News

నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ

Published on Tue, 07/18/2023 - 03:24

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులలో మానసిక ఉల్లాసం, నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉన్నతాధికారులతో కలసి సోమవారం ఆమె విద్యాశాఖ పనితీరుపై సమీక్ష జరిపారు.

ఢిల్లీ తరహాలో మన రాష్ట్రంలోని విద్యార్థులకు ఆత్మ విశ్వాసం, మానసిక ధృడత్వం పెంపొందించే లా మనోస్థైర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 6, 7వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు.

అలాగే విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. మొదటి దశలో 8 జిల్లాల్లోని 24 మోడల్‌ స్కూళ్లను ఎంపికచేసి అందులో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివే 2,500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

ఇందులో మెరుగైన 1,500 ఆవిష్కరణలను ఎంపిక చేసి ఒక్కో ఆవిష్కరణకు ప్రభుత్వం రెండు వేల రూపాయలను అందజేస్తుందని వివరించారు. వీరితో ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఏర్పాటుచేసి, భవిష్యత్తులో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం  సహకరిస్తుందని తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)