Breaking News

సాగుభూమికే రైతుభరోసా ఇవ్వాలి

Published on Thu, 07/11/2024 - 05:01

సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతుభరోసా విధివిధానా ల రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం కదిలింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో రైతులు, కౌలురైతులు, రైతుసంఘాల నేతలు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు 70 మందికి పైగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అంతేకాక లేఖ ద్వారా కూడా అభిప్రాయాలు తెలపొచ్చని మంత్రులు ప్రకటించడంతో పలువురు రైతులు లేఖలు అందించారు. సమావేశంలో మెజారిటీగా వెల్లడైన అంశాలిలా ఉన్నాయి. 

⇒ సాగుచేసే వారికే రైతుభరోసా పథకం అమలు చేయాలి. నిజమైన రైతులు ఎవరనేది వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి జాబితా రూపొందించాలి. సాగు చేయని భూములకు గతంలో రైతుబం«ధు ఇచ్చారు. ఈ విధానానికి స్వస్తి పలికితే అర్హులైన, సాగు చేసుకునే రైతులకే రైతు భరోసా అందుతుంది.  

⇒ రైతుబంధు పరిమితి లేకుండా ఎంత భూమి ఉన్నా ఇచ్చారు. అలా కాకుండా పదెకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలి. అన్ని జిల్లాల్లో రైతుల నుంచి వచ్చే మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 

⇒ సీజన్‌ ప్రారంభంలోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బంది పడతారు. ఈ సమయంలో రైతుభరోసా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.  

⇒ బంజరు భూములు, బీడు భూములు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు కూడా  రైతుబంధు ఇచ్చారు. భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందింది. రైతుభరోసాలో ఈ భూములు, ఈ కేటగిరీకి చెందిన వారిని తొలగించాలి.  

⇒ కౌలు రైతులకు ఉపయోగపడేలా రైతుభరోసా ఉండాలి. రైతుబం«ధు అందక, పంటనష్టం జరిగినా పరిహారం లేక.. ఇన్‌పుట్‌ సబ్సిడీ రాక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ఎంతో కొంతైనా రైతుభరోసా ఇవ్వాలి. లేదా సబ్సిడీపై విత్తనాలు అందించాలి. యంత్రలక్ష్మి పథకాన్ని పునరుద్ధరించి రైతులు, కౌలు రైతులకూ వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి. 

⇒ వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కౌలు రైతులను అధికారికంగా గుర్తించారు. 2011లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి అర్హులైన వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. గ్రామసభలు నిర్వహించి మళ్లీ కౌలు రైతులను గుర్తించాలి.  

⇒ ఒకటి, రెండు ఎకరాలున్న చాలామంది రైతుల భూములు ధరణిలో నమోదు కాలేదు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వీరికి పాత పాస్‌ పుస్తకాలు ఉన్నా.. ధరణిలో ఎక్కకపోవడంతో కొత్తవి రాలేదు. ఈ రైతులు రైతుభరోసా పథకాన్ని కోల్పోకుండా భూములను ధరణిలో చేర్చేందుకు రైతు సదస్సులు నిర్వహించాలి.  

⇒ ఒకే భూమికి సంబంధించి ఇద్దరు, ముగ్గురు రైతుబంధు తీసుకున్నారు. వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మారినప్పుడు ఇలా జరిగింది. వీటిని నియంత్రిస్తే అర్హులైన ఎక్కువమంది రైతులకు రైతుభరోసా అందుతుంది.  

⇒ విత్తన సబ్సిడీ, డ్రిప్‌ ఇరిగేషన్‌ సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయాలి. గతంలో జీరో పర్సెంట్‌ వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. పంటల బీమాను త్వరితగతిన అమలు చేయాలి. 

⇒ ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు పట్టాలు పొందిన, పోడు పట్టాలు పొందకుండా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతుభరోసా వర్తింపజేయాలి.   

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)