Breaking News

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 07/10/2026 - 17:18

ఖమ్మం: బీఆర్‌ఎస్‌ పార్టీని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  కౌరవవంశం కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ నుంచి తరిమికొడతామంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మళ్లీ గెలిచేది తామేనన్న సీఎం రేవంత్‌.. 117 అసెంబ్లీ సీట్లలో విజయం సాధిస్తామన్నారు.  ఇది భద్రాచలం రాముడి సాక్షిగా చెబుతున్నమాట అని, కేసీఆర్‌ రాసిపెట్టుకోవాలంటూ కూడా సవాల్‌ విసిరారు. 2028లో ఎన్నికలు కాదు.. 2029 జూన్‌లో  ఎన్నికలు జరుగుతాయన్నారు. పార్లమెంట్‌కు 26 అసెంబ్లీకి 182 సీట్లు పెరుగుతాయని కూడా రేవంత్‌ జోస్యం చెప్పారు.

ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో రైతు ఆశీర్వా సభ నిర్వహించారు. ఈ సభలో రైతు భరోసా కింద నిధులు విడుదల చేశారు సీఎం రేవంత్‌. రైతు భరోసా కింద రూ. 1009 కోట్లు విడుదల చేశారు సీఎం రేవంత్‌.  ఇప్పటికే 74 లక్షల మందికి పెట్టుబడి సాయం అందగా, తాజాగా మరో రూ. 1000 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకూ రైతు భరోసా కింద రైతులకు మొత్తం రూ. 8, 759 కోట్ల నిధులు విడుదల చేశారు. 

దీనిలో భాగంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రజాపాలనను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా తనకు గుండె లాంటిదని వ్యాఖ్యానించారు. గడిచిన 10 ఏళ్లు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందంటూ మండిపడ్డారు. గత పాలనలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజనులకు బేడీలు వేశారని ఆరోపించారు.  చెప్పింది చెప్పినట్లు చేయడం వల్లనే ప్రజాతీర్పు తమకు అనుకూలంగా ఉందన్నారు. ‘కౌరవ వంశాన్ని’ తెలంగాణ గడ్డ నుంచి తరిమికొడతానని విమర్శించారు. 

కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)