Breaking News

ఉచిత ప్రయాణంతో లాభాల్లోకి ఆర్టీసీ

Published on Thu, 07/24/2025 - 02:46

సాక్షి, హైదరాబాద్‌: గత పదేళ్లుగా పీకల్లోతు నష్టాల్లో కూరుకు­పోయిన ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాటలో పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిం దన్నారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, రూ.6,680 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారని తెలిపారు. 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ, 200 కోట్ల ప్రయాణా­లు పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో పండుగ వాతా­వరణం నెలకొందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్‌ 9న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన సంగతి గుర్తు చేశారు. ఆయా చార్జీల కింద ఆర్టీసీకి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6,680 కోట్లు చెల్లించిందని చెప్పారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడానికి ముందు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రతీరోజు 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారన్నారు. 

ఆక్యుపెన్సీ రేషియో 62 శాతం నుంచి 97కు చేరిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు మహిళా సంఘాలు సొంతంగా బస్సులను కొనుగోలు చేసి అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలో నడిపే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు భట్టి తెలిపారు. ఇలా ఇప్పటివరకు 150 బస్సులకు రూ.కోటి చెల్లించినట్లు చెప్పారు. 

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కృషి వల్లనే.. 
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కృషి వల్లనే 200 కోట్ల ఉచిత ప్రయా­ణాలు సాధించగలిగామని మంత్రి పొన్నం చెప్పారు. మహిళ­లు తమ దైనందిన ప్రయాణ అవసరాలకు ఆర్టీసీ సేవలను సది్వ­నియోగం చేసుకుంటున్నారని చెప్పారు. బస్సులకు మహి­ళలను యజమానులను చేయడమే కాకుండా ప్రభుత్వం పెట్రోల్‌ బంకులను కూడా మహిళలకు కేటాయించినట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. 

ప్రతి గ్రామం నుంచి మండలానికి, జి­ల్లా కేంద్రానికి కొత్తగా డబుల్‌ రోడ్ల నిర్మాణం వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హైద­రా­బాద్‌ కలెక్టర్‌ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)