Breaking News

కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఓకే

Published on Thu, 01/11/2024 - 05:00

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు కారుణ్య నియామక ప్రక్రియకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. విధి నిర్వహణ లో మరణించిన సిబ్బంది వారసులకోసం కారుణ్య నియామకాల కింద కండక్టర్‌ పోస్టులను భర్తీ చే యాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 1,600 కుటుంబాలు ఈ పథకంకోసం ఎదురు చూస్తున్నాయి. వాటిల్లో 813 దరఖాస్తులను మాత్రమే డిపో అధికారులు బస్‌ భవన్‌కు ఫార్వర్డ్‌ చేశారు.

ఇప్పట్లో ఈ నియామకాలు వద్దని గతంలో ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించటంతో మిగతా దరఖాస్తులు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా 813 కండక్టర్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.

కాగా, కారుణ్య నియామకాలపై ఎన్‌ఎంయూ నేత నరేందర్, టీజేఎంయూ నేత హన్మంతు, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు ధన్యవాదాలు తెలిపారు. అయితే నియామకాలు తాత్కాలిక పద్ధతిలో కాకుండా రెగ్యులర్‌ బేసిస్‌లో చేపట్టాలని ఓ ప్రకటనలో కోరారు. 

ఆ కుటుంబాలకు న్యాయం: మంత్రి పొన్నం 
‘ఆర్టీసీలో నియామకాలు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కండక్టర్‌ నియామకాలు చేపట్టాం. దానిలో భాగంగా 813 మంది కండక్టర్లను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు దీంతో న్యాయం జరుగుతుంది’. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)