Breaking News

సెలవొస్తే.. సిటీబస్సు ట్రిప్పులకూ బ్రేక్‌!

Published on Fri, 08/22/2025 - 01:26

రామంతాపూర్‌కు చెందిన ఆంజనేయులు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం రాత్రి 8.30 గంటలకు బంజారాహిల్స్‌ నుంచి బయలుదేరి 9 గంటలకు లక్డీకాపూల్‌ చేరుకున్నారు. రాత్రి 10.30 వరకు ఎదురుచూసినా రామంతాపూర్‌ బస్సు రాలేదు. అప్పటికే అక్కడ 30 మంది వరకు ప్రయాణికులు జమయ్యారు. 

ఓవైపు బోరున వర్షం కురుస్తుండటం, ఇటు బస్సు రాకపోవటంతో వారి అవస్థలు వర్ణనాతీతం. రెండుగంటలపాటు ఎదురుచూస్తే గానీ బస్సు రాలేదు. ఇది ఒక్క ఆంజనేయులుకు ఎదురైన పరిస్థితే కాదు.. ఆదివారం సాయంత్రం నుంచి నగరవ్యాప్తంగా వేలాదిమంది ప్రయాణికులు ఎదుర్కొన్న దుస్థితి. వర్షం కురిసే సమయం...సెలవు రోజుల్లో ఇదే పరిస్థితి ఎదురుకానుంది.  

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయం పెంపుపై దృష్టి సారిస్తున్న ఆర్టీసీ.. మరోవైపు ఖర్చులను కూడా నియంత్రించుకునే పనిలో నిమగ్నమైంది. ఇప్పుడు ఈ ఆలోచన నగరవాసులపై పెద్ద ప్రభావమే చూపబోతోంది. వానలు కురిసిన సమయంలో, పండుగల వేళ రద్దీ అంతంత మాత్రమే ఉంటోందని భావిస్తున్న ఆర్టీసీ, ఆయా సమయాల్లో బస్సులను పరిమితంగానే నడపాలని యోచిస్తోంది. 

ఇటీవల వర్షం కురిసిన ఓ రోజు కొన్ని ప్రాంతాల్లో తక్కువ రద్దీతో బస్సులు తిరగటాన్ని గుర్తించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆ సమయంలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుందని, అలాంటి సమయాల్లో బస్సుల సంఖ్య తగ్గించి తిప్పాలని డిపో మేనేజర్లను మౌఖికంగా ఆదేశించారు. శనివారం మరోసారి పరిశీలించిన అధికారులు, రద్దీ తక్కువగా ఉన్నా.. ఎక్కువ బస్సులు ఎందుకు తిప్పుతున్నారంటూ సిటీ అధికారులను ప్రశ్నించారు. దీంతో సంబంధిత అధికారులు అందరు డిపో మేనేజర్లకు మరోసారి సీరియస్‌గా మౌఖికంగానే ఆదేశాలిచ్చారు. 

ఆదివారం నుంచి బస్సుల సంఖ్య తగ్గించాలని పేర్కొన్నారు. దీంతో డిపో మేనేజర్లు ఆదివారం దాదాపు 20 శాతం బస్సు ట్రిప్పులను తగ్గించేశారు. రాత్రి పూట ఎక్కువ బస్సులను రద్దు చేశారు. రాత్రి 9 తర్వాత సింహభాగం బస్సులను డిపోలకే పరిమితం చేసి అతి పరిమితంగా నడిపారు. దీంతో ఆ సమయంలో రోడ్లపై మిగిలిపోయిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచి్చంది.  

2019లోనూ ఇదే తరహాలో... 
2019లో దీర్ఘకాల సమ్మె తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ తీరుపై సమీక్షించిన సమయంలోనూ ఇదే తరహా నిర్ణయం జరిగింది. నగరంలో రద్దీ లేని సమయాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో బస్సులు తిప్పుతున్నారని, ఇది డీజిల్‌ దుబారాకు కారణమవుతోందని పేర్కొన్న ప్రభుత్వం, నగరంలో 2 వేల బస్సులు తగ్గించాలని ఆదేశాలిచ్చింది. అప్పుడు అంతమేర బస్సులను రద్దు చేసిన ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. 

నగరంలో కేవలం 3 వేల బస్సులు మాత్రమే ఉండగా, హైదరాబాద్‌ నగర జనాభాతో సమంగా ఉన్న బెంగళూరులో ప్రస్తుతం 8,900 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. అసలే తక్కువ బస్సులున్న తరుణంలో ఒకేసారి 2 వేల బస్సులు తగ్గించటంతో ఏర్పడిన కొరత ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ తరుణంలో రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఆ సంఖ్యను మరింత తగ్గించి నడిపితే, రోడ్లపై ఉన్న ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి వస్తుంది. 

కానీ, ప్రయాణికుల అవస్థల కంటే ఆదాయమే ముఖ్యమన్న తరహాలో ఆర్టీసీ వ్యవహరిస్తుండటం ఇప్పుడు నగర ప్రయాణికులకు శాపంగా మారబోతోంది. గత్యంతరం లేని స్థితిలో, జేబులో బస్‌పాస్‌ ఉండి కూడా ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. మహాలక్ష్మి పథకం ఉండి కూడా మహిళలు భారీ మొత్తం చెల్లించి ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాల్సి వస్తోంది.  

రద్దీ లేకుంటే రద్దు చేయమన్నారు 
రోడ్లపై ప్రయాణికుల సంఖ్యను గమనిస్తూ తక్కువగా ఉన్న రోజుల్లో 10 నుంచి 15 శాతం సర్వీసులు నడపొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ఆదివారం మా డిపో పరిధిలో సాయంత్రం తర్వాత కొన్ని సర్వీసులను రద్దు చేశారు. సెలవు రోజుల్లో ఇలాగే కొనసాగించాలని సూచించారు.  – ఓ కండక్టర్‌  

ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు  
రాత్రి 9:30 గంటల సమయంలో బస్సుల కోసం గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఎదురుచూసే పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ సమయంలో 113 నంబరు బస్సు కోసం గమ్యం యాప్‌ చూస్తే వాటి జాడే లేదు. రాత్రి పదిన్నర సమయంలో ఒక బస్‌స్టాప్‌లో 30 మంది ప్రయాణికులు జమయ్యారంటే సర్వీసుకు సర్వీసుకు మధ్య విరామం ఎంత ఎక్కువగా ఉందో అవగతమవుతుంది.      –ఆంజనేయులు, రామంతాపూర్‌ 

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)