వర్షాల ఎఫెక్ట్‌.. ఆర్టీసీ బస్సుల బీభత్సం

Published on Thu, 07/25/2024 - 10:31

సాక్షి, వనపర్తి/ఆదిలాబాద్‌: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి మహబూబ​్‌నగర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో రెండు ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం సందర్భంగా ఓ బస్సు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ​క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో కలిపి వంద మందికిపైగా ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం.

మరోవైపు.. ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్-భీంపూర్ మండలంలో కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే అదుపుతప్పింది.ఈ అనంతరం బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి అనిల్‌ అనే రైతు కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సందర్భంగా కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది. దీంతో, ఎద్దు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణీకులు ఉన్నారు.

 

వీడియో క్రెడిట్‌: Telugu Scribe

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)