చిన్న కాళేశ్వరానికి రూ. 571 కోట్లు

Published on Sun, 11/24/2024 - 04:50

సాక్షి, హైదరాబాద్‌: చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మిగులు పనుల పూర్తికి ప్రభుత్వం రూ.571 కోట్లతో పాలనాపర అనుమతులు జారీ చేసిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. 

మంథని నియోజకవర్గం పరిధిలోని 63 గ్రామాలను సస్యశ్యామలం చేయడానికి 2007లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకి సంబంధించిన 75 శాతం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చి సత్వరం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

శ్రీధర్‌బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శనివారం జలసౌధలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి 45 వేల ఎకరాలకు సాగునీరు, 0.5 టీఎంసీలను తాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. 

గోదావరి నుంచి అప్రోచ్‌ కాల్వ ద్వారా నీళ్లను కన్నెపల్లి వద్ద ఒకటో పంప్‌హౌస్‌కి తరలించి అక్కడి నుంచి మందిరం చెరువు, ఎర్ర చెరువుకు, ఆ తర్వా త రెండో పంప్‌హౌస్‌కి ఎత్తిపోస్తారు. మొత్తం 4.2 టీఎంసీలను రెండో పంప్‌హౌస్‌కు పంప్‌చేస్తారు. కాగా, వరదకు తెగిపోయిన రుద్రారం చెరువు పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.  

శ్రీరాంసాగర్‌ నీటితో 28 వేల ఎకరాల ఆయకట్టు 
మంథని నియోజకవర్గంలో శ్రీరాంసాగర్‌ కింద 28,800 ఎకరాల ఆయకట్టు ఉంది. డీ–83 డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ ద్వారా గుండారం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరుకోవాలి. అక్కడి నుంచి 24 మైనర్‌ కాల్వల ద్వారా మొత్తం 28,800 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. 

కాలక్రమేణా కాల్వల్లో పూడిక చేరడంతో నిర్దేశిత ఆయకట్టుకు నీరు అందడం లేదు. గుండారం చెరువు నుంచి చివరి వరకు మరమ్మతులు చేసినీటి సామర్థ్యాన్ని పెంచాలని శ్రీధర్‌ బాబు ఆదేశించారు.   

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)