Breaking News

షాహీ నాష్టా.. నోరూరించే నిజాంల నాటి వంటకాలు

Published on Thu, 07/18/2024 - 11:05

షాహీ నాష్టా.. అంటే నిజాం కాలంలో ఉదయం పూట అల్పాహారం. పాయారోటీ, గుర్దాభాజీ, ఖీమారోటీ, ఖిచిడీ ఖీమాలాంటి పదార్థాలను నిజాములు అల్పాహారంగా  సేవించేవారు. నిజాముల కాలం నాటి వంటకాలు కొన్ని నేటికీ ప్రజాదరణలో ఉన్నాయి. క్రమేణా ఈ వంటకాలన్నీ పాతబస్తీ హోటళ్లు, సికింద్రాబాద్‌లోని ఒకటి రెండు హోటళ్లలో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో నగరంలో నాన్‌వెజ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అందించే రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతోంది. జంటనగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో నాన్‌వెజ్‌ అల్పాహార వంటకాల కోసం ఉదయం పూట వందలాది మంది వేచి చూస్తారంటే అతిశయోక్తి కాదు.   
– సికింద్రాబాద్‌

వయసుతో పని లేకుండా...  
ప్రతిరోజు 6 గంటల నుంచే వేడివేడిగా మాంసాహారపు వంటకాల అల్పాహారాలను రెస్టారెంట్ల నిర్వాహకులు సిద్ధంగా ఉంచుతున్నారు. భాజీగుర్దా, ఖీమా కర్రీ, పాయ వంటి పురాతన వంటకాలతోపాటు చిల్లిగారె, పూరి, ఇడ్లీ, వడ, దోశ, రాగిముద్ద వంటి బ్రేక్‌ఫాస్ట్‌ను చికెన్, మటన్‌తో కూడిన వివిధ వంటకాలతో రడీగా ఉంచుతున్నారు. మరికొన్ని హోటళ్లు అయితే ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకూ నాన్‌వెజ్‌ వంటకాలను అందుబాటులో ఉంచుతున్నారు. రాత్రి 12 గంటల లోపే నాణ్యమైన మాంసం, అవసరమైన ఆకుకూరలు, మసాలాలను సిద్ధం చేసుకుని తెల్లవారుజామున ఒంటిగంట, రెండు గంటల ప్రాంతంలో వంటలు ప్రారంభిస్తున్నారు. ఉదయం 5 గంటలకు రెస్టారెంట్లను తెరిచి పూరి, రోటీ ఇతర టిఫిన్లతో కస్టమర్లకు సర్వ్‌ చేస్తున్నారు.

వయసుతో పని లేకుండా... 
ఉదయం వేళల్లో చోటా ఆరగించేవాళ్లలో అన్ని వయస్కుల వాళ్లూ కనిపిస్తున్నారు. 18 ఏళ్ల నవయువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకూ ఈ టిఫిన్లు ఆరగిస్తున్నారు. కేవలం  నాన్‌వెజ్‌ కర్రీతో ప్రత్యేకంగా లభించే టిఫిన్లు ఆరగించడం కోసం వచ్చే వాళ్లు మిత్రులుగా మారిన వారూ ఉంటున్నారు. నాన్‌వెజ్‌ టిఫిన్లు సేవించేవారు మైదానాల్లోనే మిత్రులుగా మారుతున్నారు. కొందరు ఐతే ఏకంగా నాన్‌వెజ్‌ టిఫిన్స్‌ కోసం చాట్‌ గ్రూప్స్‌ మెయింటెన్‌ చేస్తున్నారు.  

వారాంతాల్లో జాతరే!
రోజు రోటీ, ఇతర టిఫిన్లు తినేందుకు నాన్‌వెజ్‌ టిఫిన్‌ సెంటర్లు, రెస్టారెంట్ల వద్ద కస్టమర్లు బారులు తీరుతున్నారు. శని, ఆదివారం 
వచి్చందంటే చాలు మాంసాహార టిఫిన్‌సెంటర్ల ముందు జాతర కనిపిస్తుంది. భాజీగుర్దా.. ఖీమాతో రోటీపాటు, ఇడ్లీ, వడ, దోశ వంటి అల్పాహారాలు కూడా మాంసం కూరలతో తినేందుకు ఇష్టపడుతున్నారు. 

దీంతో కస్టమర్లతో రెస్టారెంట్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. మార్నింగ్‌ వాకర్లు, స్మిమ్మర్లు, జిమ్‌కు వెళ్లేవాళ్లు, క్రికెటర్లు వారాంతపు రోజులు, సెలవు దినాల్లో వ్యాయామం ముగించుకున్నాక నేరుగా మాంసాహార టిఫిన్‌ సెంటర్ల వద్దకు చేరుకుంటారు. వీళ్లే కాకుండా పలువురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కూడా సెలవు దినాల్లో నాన్‌వెజ్‌ టిఫిన్స్‌ ఆరగించేందుకు ఉవి్వళ్లూరు      తున్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)