Hyderabad: చిక్కడపల్లిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Published on Mon, 08/18/2025 - 07:55

హైదరాబాద్: వివేక్‌నగర్‌లో ఇద్దరు రిటైర్డ్‌ ఉద్యోగుల ఇంట్లో చోరీ జరిగిన 48 గంటల్లోనే చిక్కడపల్లి పోలీసులు కేసును చేధించారు. ఆదివారం సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కె.శిల్పావల్లి కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటకు చెందిన బ్రూస్‌లీపై ఈనెల 13న చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇతడిపై 64 కేసులు ఉన్నాయని తెలిపారు. 

చిక్కడపల్లిలోని వివేక్‌నగర్‌లోని దిట్టకవి ఎన్‌క్లేవ్‌లో నివసించే రిటైర్డ్‌ ఉద్యోగులైన లక్ష్మీనారాయణ, రాజేశ్వరిల ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగిలించారు. రాయుడు చైతన్యసాయికుమార్‌తో కలిసి ఆభరణాలను విక్రయించాలని పథకం పన్నారు. ఇతడిపై సైతం దాదాపు 67 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో సెంట్రల్‌ జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు సుందరయ్య పార్క్‌ వద్ద వారిని పట్టుకున్నారు. 

పోలీసులు తమ తీరులో విచారించడంతో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరచి జ్యూడీషియల్‌ కస్టడీకి తరలించామని తెలిపారు. వారి వద్ద నుంచి 25.8తులాల బంగారు ఆభరణాలు, రూ.23వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. ప్రతి కాలనీలీ, అపార్ట్‌మెంట్‌లలో ప్రతి ఒక్కరూ సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ కోరారు. పోలీసులు కేసును చేధించడంతో పీపుల్స్‌పార్క్‌ రెసిడెన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పోలీసులకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఎసీపీ రమేష్‌ కుమార్, సీఐ రాజునాయక్, డీఐ శంకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)