Breaking News

జూరాల: కారు ఢీ.. ఎగిరిపడి డ్యామ్‌లో గల్లంతు

Published on Mon, 07/21/2025 - 10:48

సాక్షి, గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల డ్యామ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో తమపై కారు దూసుకురావడంతో ఒక యువకుడు ప్రాణభయంతో డ్యామ్‌లోకి దూకి గల్లంతయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు యువకులు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. 

వివరాల్లోకి వెళితే, మానవపాడు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ (21), జానకిరాములు, ఇంకా ఇద్దరు స్నేహితులు కలిసి జూరాల డ్యామ్ సందర్శనకు వచ్చారు. రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో వారు డ్యామ్ బ్రిడ్జిపై నుంచి గద్వాల వైపు వెళ్తుండగా, కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్న కారు అజాగ్రత్తగా, సెల్‌ఫోన్ చూస్తూ మోటారు సైకిళ్లను ఢీకొట్టేందుకు దూసుకొచ్చింది.    తప్పించుకొనే ప్రయత్నంలో  ప్రాజెక్టుపై నుంచి 53 వ గెట్ నదిలోకి  పడి గల్లంతయిన యువకుడు మహేష్..  మరొక్క యువకునికి గాయాలయ్యాయి. 

జానకిరాములు తీవ్రంగా గాయపడ్డాడు. మిగతా ఇద్దరు యువకులు దూరంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గాయపడిన యువకుడిని హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో డ్యామ్ పరిసరాల్లో అలజడి నెలకొంది. గల్లంతైన మహేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)