Breaking News

HYD: న‌లుగురు విద్యార్థుల దుర్మ‌ర‌ణం

Published on Thu, 01/08/2026 - 06:50

సాక్షి,హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మీర్జాగుడా వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు విద్యార్థులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. గాయపడిన నక్షత్ర అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.  

హైదరాబాద్‌ ఇక్ఫాయి యూనివర్సిటీ విద్యార్థలు శ్రీ నిఖిల్,సూర్యతేజ,సుమిత్‌,రోహిత్,నక్షత్ర కోకాపేటలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం, ఓ స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి నగరానికి వస్తుండగా ఘోరం జరిగింది. మితిమీరిన వేగంతో మీర్జాగుడా వద్ద ఢీవైడర్‌ను ఢీకొట్టింది.  వేగం ఎక్కువగా ఉండటంతో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.

దీంతో కారు బోల్తా పడి నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. నక్షత్ర అనే యువతికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు యువతిని అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)