Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన డీఎస్పీలు మృతి!

Published on Sat, 07/26/2025 - 06:59

యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.

వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌లోని ఖైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున స్పార్కియో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతులను ఏపీకి చెందిన డీఎస్పీ శాంతారావు, మేక చక్రధర్‌గా గుర్తించారు. వీరు ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నట్టు సమాచారం. ఇక, వాహనం ఏపీ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే, పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. 

ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంపై వైఎస్‌ జగన్ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)