దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
Published on Sun, 06/21/2026 - 21:26
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను భద్రాచలానికి చెందిన దూడల సాయి ప్రకాష్, ఆయన భార్య సంధ్య, మరియు వారి కుమారుడు మోక్ష్గా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో సాయి ప్రకాష్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags : 1