Breaking News

అమ్మా.. లేమ్మా..

Published on Thu, 02/26/2026 - 05:02

ఇల్లెందురూరల్‌: బంధువుల ఇంట్లో వివాహానికి బయలుదేరిన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృత్యువాత పడగా, తండ్రి, కుమారుడికి కాళ్లు విరిగి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బొజ్జాయిగూడెం శివారు కొల్లాపురం గ్రామానికి చెందిన పాయం సురేశ్, ధనమ్మ(30) దంపతులు.. కుమార్తె జయశ్రీ(11), కుమారుడు సాత్విక్‌తో కలిసి గుండాల మండలం మర్కోడులో ధనమ్మ సోదరి ఇంట్లో వివాహానికి బైక్‌పై బయలుదేరారు.

సురేశ్‌ బైక్‌ నడుపుతుండగా వెనుక సాత్విక్, చివరన ధనమ్మ, పెట్రోల్‌ ట్యాంక్‌పై జయశ్రీ కూర్చున్నారు. సుదిమళ్ల స్టేజీ వద్ద పెట్రోల్‌ పోయించుకునేందుకు బంక్‌లోకి వెళుతుండగా ఇల్లెందు నుంచి కొత్తగూడెం వైపు ద్విచక్రవాహనంపై వెళుతున్న గుగులోత్‌ శ్రీనివాస్‌ వీరి బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో బైక్‌ రోడ్డుపై పడగా.. అదే సమయాన ఇల్లెందు నుంచి కొత్తగూడెం వైపు వేగంగా వెళుతున్న లారీ సురేశ్‌ కుటుంబసభ్యుల పైనుంచి దూసుకెళ్లింది. ధనమ్మ తల, జయశ్రీ నడుము భాగం మీదుగా లారీ వెళ్లగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. సురేశ్‌ ఒక కాలు, సాత్విక్‌ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. 

పాకుతూ వెళ్లేందుకు..: రెండు కాళ్లూ విరిగి తల్లి పక్కనే పడిపోయిన సాత్విక్‌ తన కాళ్లను చూసుకుంటూనే ధనమ్మ వైపు తిరిగి ‘అమ్మా.. లే అమ్మా’అంటూ చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టించాయి. రోడ్డుపై పాకుతూ తల్లి, అక్క మృతదేహాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బాలుడిని చూసి అంతా చలించిపోయారు. సమాచారం అందుకున్న ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్‌ సిబ్బందితో వచ్చి సురేశ్‌ సాత్విక్‌ను 108లో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఖమ్మం రిఫర్‌ చేయగా.. ఖమ్మంలో పరీక్షించిన వైద్యులు సాత్విక్‌ను హైదరాబాద్‌ నిమ్స్‌కు, సురేశ్‌ను వరంగల్‌ ఎంజీఎంకు సిఫారసు చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)