Breaking News

ఆర్‌ఎంపీ వివాహేతర సంబంధం.. జ్యోతిని కారులో తీసుకెళ్లి..

Published on Mon, 06/30/2025 - 12:13

సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను పక్కాగా ప్లాన్‌ ప్రకారం ఓ ఆర్‌ఎంపీ హత్య చేశాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే పూడ్చిపెట్టేందుకు యత్నం చేశాడు. కానీ, పోలీసులు రంగం ప్రవేశం చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.

వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడ్‌ మండలంలో మహేష్‌ అనే వ్యక్తి ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక జునూతలలో జ్యోతి అనే మహిళతో​ పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో, ఒత్తిడికి గురైన మహేష్‌.. జ్యోతిని అడ్డుతొలంగిచుకోవాలని చూశాడు. తాజాగా ఆమెతో మాట్లాడిన మహేష్‌.. బయటకు తీసుకెళ్లే నెపంతో దేవరకొండ నుంచి బాధితురాలిని తీసుకుని కారులో బయలుదేరాడు.

అనంతరం, మార్గ మధ్యంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఆగ్రహానికి లోనైన మహేష్‌.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును బలవంతంగా ఆమెతో తాగించాడు. జ్యోతిని హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్‌.. ఆమెకు విషపు ఇంజక్షన్‌ కూడా ఇచ్చాడు. జ్యోతి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే.. ఆమెను మట్టిలో పూడ్చిపెట్టాలని అనుకున్నాడు. అయితే, మహేష్‌ వెళ్తున్న కారుపై అనుమానం వచ్చిన పెట్రోలింగ్‌ పోలీసులు.. అతడిని వెంబడించారు. కారును ఆపి పరిశీలించగా.. కొన ఊపిరితో ఉన్న జ్యోతిని చూసి వెంటనే.. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే జ్యోతి మృతి చెందింది. అనంతరం, నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)