Breaking News

కొత్త సభ్యులకు రేషన్‌ కోటా!

Published on Thu, 05/22/2025 - 07:59

సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్‌ (ఆహార భద్రత) కార్డుల్లో కొత్త యూనిట్లకు కోటా కేటాయించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. మే నెలలో కొన్ని కొత్త యూనిట్లకు బియ్యం కోటా విడుదల చేయగా.. తాజాగా  మరికొన్ని యూనిట్లకు జూన్‌ కోటా కేటాయించి విడుదల చేయాలని నిర్ణయించింది. ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం కొత్త యూనిట్లకు ఆమోదం లభించిన విషయం విదితమే. 

అయితే.. రేషన్‌ కార్డు లబ్ధి కుటుంబాల్లో కొత్తగా సభ్యులుగా చేరిన ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్‌ కోటా కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నా.. పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా కార్డుల్లోని ప్రతి యూనిట్‌కు బియ్యం కోటా విడుదల ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 

60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం.. 
గ్రేటర్‌ పరిధిలో ఇప్పటి వరకు 60 శాతం కొత్త సభ్యులకు ఆమోదం లభించినట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిరిగి జిల్లాల పౌరసరఫరాల పరిధిలో సుమారు మూడు లక్షల లబ్ధి కుటుంబాలు కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. ఇప్పటి వరకు సుమారు సగానికి పైగా ఆమోదం లభించినట్లు  తెలుస్తోంది. 

 మిగిలిన దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరసరఫరాల అధికారులు మాత్రం పాతరేషన్‌ కార్డుల్లో  కొత్త సభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంటున్నారు. మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా వచి్చన ప్రతి పెండింగ్‌ దరఖాస్తునూ పరిశీలించి అర్హులై సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)