Breaking News

మెట్రో రెండోదశకు జైకా నిధులు!

Published on Fri, 02/23/2024 - 03:04

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రెండో దశ ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళనకు నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురువారం మెట్రో రైల్‌ విస్తరణ, మూసీనది పరీవాహక ప్రాంత అభివృద్ధికి తక్కువ వడ్డీకి రుణాలు, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) ఇండియా చీఫ్‌ రిప్రజెంటేటివ్‌ సైటో మిత్సునోరితో చర్చలు జరిపారు.

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత అంచనాల మేరకు 70 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రెండో దశకు అయ్యే రూ.18,900 కోట్ల వ్యయంలో సుమారు రూ.9,000 కోట్ల వరకు జైకా నుంచి, ఇతర సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించే అవకాశముంది. మెట్రో నిర్మాణ ఒప్పందం మేరకు కేంద్రం

35 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మరో
20 శాతం  నిధులు భరించాలి. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. ప్రస్తుతం జైకా మాత్రమే అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థపైనే ఆశలు పెట్టుకుంది. మెట్రోతో పాటు, మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కూడా జైకా నిధులే కీలకం కానున్నాయి. ‘ఆ సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఆశించిన స్థాయిలోనే రుణాలు లభిస్తాయని భావిస్తున్నాం.’అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)