Breaking News

2న ‘సమగ్ర సర్వే’ నివేదిక

Published on Thu, 01/30/2025 - 04:18

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను అధికారులు వచ్చే నెల 2న మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించనున్నారు. దానికన్నా రెండు రోజులు ముందే నివేదిక ముసాయిదాను సిద్ధం చేసి అందించనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో వెల్లడించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బుధవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సమీక్షించారు. 

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. 

ఈ సర్వే రాష్ట్రంలో సామాజిక సాధికారతతోపాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల సర్వే చేపట్టి చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌కు ఈ గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని.. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం పట్ల ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు. 

విస్తృత స్థాయిలో ప్రక్రియ చేపట్టి.. 
గత ఏడాది ఫిబ్రవరి 4న సీఎం రేవంత్‌ నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం.. ఇంటింటి సర్వే ద్వారా కుల గణన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సబ్‌ కమిటీ ఏర్పాటు, పరిశీలన తర్వాత.. నవంబర్‌ 6న ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే–2024’ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డిసెంబర్‌ మొదటి వారంలో సర్వే పూర్తయింది. 

ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలిపి దాదాపు లక్ష మంది వరకు ఉద్యోగులు పాలుపంచుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వే కోసం గుర్తించగా.. 96 శాతం కుటుంబాల వివరాలను సర్వే బృందాలు సేకరించాయి. కొన్నిచోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, ఇళ్లకు తాళాలు ఉండటం, అందుబాటులో లేకపోవటంతో మిగతా కుటుంబాల వివరాల సేకరణ జరగలేదని అధికారులు సమీక్షలో వివరించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)