Breaking News

రిటైర్డ్‌ ఆర్మీ జవానుకు 20 ఏళ్ల జైలు

Published on Sat, 06/29/2024 - 08:50

రాంగోపాల్‌పేట్‌: ఓ మైనర్‌ బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన ఓ రిటైర్డ్‌ ఆర్మీ జవానుకు పోక్సో స్పెషల్‌ సెషన్స్‌ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన 2017 సంవత్సరంలో జరిగింది. మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్‌ బాలిక రెజిమెంటల్‌బజార్‌లోని హోంలో ఉంటూ 31బస్టాప్‌ ప్రాంతంలోని పాలికాబజార్‌లో ఉండే ఓ టైలరింగ్‌ సెంటర్‌లో టైలరింగ్‌ నేర్చుకుంటోంది. 

2017 జూలై 24వ తేదీన ఉదయం 11గంటలకు టైలరింగ్‌ సెంటర్‌కు వెళ్తుండగా ఆర్మీలో పదవి విరమణ పొందిన యాప్రాల్‌లో నివాసం ఉండే పెరియాటి శ్రీధరన్‌(59) బాలికను ఆపి భోజనం చేశావా అంటూ ప్రశ్నించాడు. భోజనం పెట్టిస్తానని ముత్యాలమ్మ దేవాలయం ప్రాంతంలోని ఓ హోటల్‌కు తీసుకుని వెళ్లి భోజనం పెట్టించాడు. అక్కడి నుంచి ఆ బాలికను హోటల్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అటు తర్వాత మనోహర్‌ థియేటర్‌ ప్రాంతంలోని ఓ లైన్‌లో ఆ బాలికను విడిచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బాలిక హోంకు వెళ్లి రెండు రోజుల పాటు ఏడుస్తూ విచారంగా ఉంది.

 హోంలోని ఓ ఆరోగ్య కార్యకర్త గమనించి ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే 27వ తేదీన హోం నిర్వాహకులు మంజుల, పద్మ బాలికను తీసుకుని వెళ్లి మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించి చార్జిïÙట్‌ను కోర్టుకు సమరి్పంచారు. పోక్సో ప్రత్యేక సెషన్స్‌ జడ్జి పుష్పలత కేసును విచారించి పోలీసులు సమరి్పంచిన సాక్ష్యాధారాలతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. మరో రూ.20వేల జరిమానా కూడా విధించారు. ఈ అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతాప్‌రెడ్డి బాలిక తరఫున వాదనలు వినిపించి శిక్ష పడేలా చూశారు.   

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)