Breaking News

అమ్మకానికి స్వగృహ ఫ్లాట్లు, టవర్లు

Published on Sun, 07/06/2025 - 04:39

సాక్షి, హైదరాబాద్‌: గతంలో నిర్మించి అమ్ముడుకాకుండా మిగిలిపోయిన ఫ్లాట్లను రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ మరోసారి వేలంలో ఉంచింది. సాధారణ ఫ్లాట్లతోపాటు, అసంపూర్తిగా ఉండిపోయిన ఫ్లాట్లతో కూడిన టవర్లను ఉన్నవి ఉన్నట్టుగా అమ్మకానికి ఉంచింది. గాజులరామారంలో 14 అంతస్తులతో ఉన్న రెండు టవర్లు, పోచారంలో 9 అంతస్తులతో ఉన్న రెండు టవర్లు, బండ్లగూడలో వివిధ కేటగిరీలకు చెందిన 159 ఫ్లాట్లు, పోచారంలో 607 ఫ్లాట్లను లాటరీ ద్వారా విక్రయించనుంది.  

పోచారంలో టవర్లు ఇలా.... 
»  పోచారంలో 1,470–1,606 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన 122 ఫ్లాట్లున్న 3,287 చదరపు గజాల విసీర్ణంలో నిర్మించిన 9 అంతస్తుల టవర్‌ను రూ.30 కోట్ల ధరకు (ధరావతు రూ.2 కోట్లు) విక్రయించనుంది. 
»   1,125–1,261 చ.అ. విస్తీర్ణంతో కూడిన 72 ఫ్లాట్లున్న 1,396 చ.గ. విస్తీర్ణంలో నిర్మించిన మరో టవర్‌ను రూ.13.78 కోట్లకు (ధరవాతు రూ.కోటి) అమ్మకానికి ఉంచింది.  
»   1,150–1,232 చ.అ. విస్తీర్ణంతో వివిధ కేటగిరీలతో కూడిన 112 ఫ్లాట్లున్న 6,720 చ.గ. విస్తీర్ణంలో నిర్మించిన టవర్‌ను రూ.26.33 కోట్లకు (ధరావతు రూ.2 కోట్లు), 1,150–1,232 చ.అ. విస్తీర్ణం, వివిధ కేటగిరీలతో కూడిన 112 ఫ్లాట్లున్న 6847 చ.గ. విస్తీర్ణంలో నిర్మించిన మరో టవర్‌ను రూ.26.33 కోట్లకు (ధరావతు రూ.2 కోట్లు) విక్రయించనుంది. గాజులరామారం, పోచారం టవర్లకు ఆగస్టు 19లోపు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 20న హిమాయత్‌నగర్‌లోని గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో లాటరీ నిర్వహిస్తారు.  

బండ్లగూడలో ఫ్లాట్లు ఇలా... 
బండ్లగూడలోని సహభావన టౌన్‌షిప్‌లో 1,487, 1,617 చ.అ. విస్తీర్ణంలో ఉన్న 3 బీహెచ్‌కే డీలక్స్‌ ఫ్లాట్లు రూ.49 లక్షల కనీస ధరకు అమ్మబోతోంది. 
»   1,141, 1,266 చ.అ. విస్తీర్ణంలోని 3 బీహెచ్‌కే ఫ్లాట్లను రూ.38 లక్షల కనీస ధరకు, 798 చ.అ. విస్తీర్ణంలోని 2 బీహెచ్‌కే కనీస ధర రూ.22 లక్షలు, 545 చ.అ. విస్తీర్ణంలోని 1 బీహెచ్‌కే కనీస ధర రూ.15 లక్షలు, 645 చ.అ. విస్తీర్ణంలోని సీనియర్‌ సిటిజన్‌ ఫ్లాట్‌ కనీస ధర రూ.18 లక్షలుగా నిర్ధారించారు. బండ్లగూడ ఫ్లాట్లకు ధరావతును జూలై 29లోపు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ 30న ఉంటుంది. 

పోచారంలో ఫ్లాట్లు ఇలా... 
»  పోచారంలో1,400–1,600 చ.అ. 3 బీహెచ్‌కే డీలక్స్‌ ఫ్లాట్ల కనీసం ధర రూ.34 లక్షలు, 1,150–1,250 చ.అ. 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు కనీస ధర రూ.27 లక్షలు, 761 చ.అ. 2 బీహెచ్‌కే ఫ్లాట్ల కనీస ధర రూ.19 లక్షలు, 523 చ.అ. 1బీహెచ్‌కే ఫ్లాట్ల కనీస ధర రూ.13 లక్షలుగా నిర్ధారించారు. పోచారం ఫ్లాట్లకు జూలై 31లోపు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ ఆగస్టు 1న ఉంటుంది.  

కేపీహెచ్‌బీ–హైటెక్‌సిటీ కారిడార్‌లో అమ్మకానికి 7.3 ఎకరాల భూమి  
భారీ ఆకాశహర్మ్య నిర్మాణానికి అనువైన ఏడెకరాల భూమిని తెలంగాణ గృహనిర్మాణ మండలి అమ్మకానికి ఉంచింది. గతంలో కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి భూములు కేటాయించగా మిగిలిన ఏడెకెరాల భూమిని గృహనిర్మాణ మండలి అలాగే కాపాడుకుంటూ వచ్చింది. ఆ ప్రాంతంలో భారీ ఆకాశహర్మ్యాలు వెలుస్తున్న తరుణంలో, అలాంటి ప్రాజెక్టు చేపట్టే సంస్థకు భూమిని వీలైనంత ఎక్కువ ధరకు కట్టబెట్టాలని బోర్డు నిర్ణయించింది.

ఈ మేరకు దాన్ని వేలంలో ఉంచుతూ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని విక్రయం ద్వారా దాదాపు రూ.650 కోట్ల వరకు సమకూరుతుందని గృహనిర్మాణ మండలి అంచనా వేస్తోంది. ఇక్కడ గజం ధర రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతోంది. ఇలాంటి కీలక ప్రాంతంలో ఉన్న ఈ 7.3 ఎకరాల భూమి కోసం బడా సంస్థలు బిడ్లు దాఖలు చేసే వీలుంది. 

» కేపీహెచ్‌బీలో 4,598, 2,420 చదరపు గజాల రెండు కమర్షియల్‌ ప్లాట్లు, నాంపల్లిలో 1,148.30 చదరపు గజాల ప్లాట్‌ను కూడా వేలంలో ఉంచింది. వీటికి ఈ నెల 30న వేలం జరగనుంది. పూర్తి వివరాలను తెలంగాణ గృహనిర్మాణ మండలి(హౌసింగ్‌బోర్డు) వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.  

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)