Breaking News

పరస్పర అంగీకారంతోనే కలిసి ఉన్నారు

Published on Wed, 07/16/2025 - 04:45

సాక్షి, హైదరాబాద్‌: అత్యాచార ఆరోపణలపై నమోదైన కేసులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రంజిత్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలసి ఉన్నప్పుడు ఒక్కరిపై ఆరోపణలు చేయడం సరికాదని, అవి నిరాధారమైనవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు(మహిళ) గతంలోనూ ఇలా మరొకరిపై ఫిర్యాదు చేయగా, అతనిపై కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించింది. 21 ఏళ్ల మహిళకు తాను ఏం చేస్తున్నానో తెలుసని.. తెలిసే పిటిషనర్‌తో ఉన్నారని అభిప్రాయపడింది. దీనికి పిటిషనర్‌ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెబుతూ.. రంజిత్‌పై కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 

ఫిర్యాదుదారు మేరకు.. ‘2017లో నేను హాస్టల్‌లో ఉండి ఎంఏ ఇంగ్లిష్‌ చదువుతున్నప్పుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌తో పరిచయం ఏర్పడింది. తన భార్యకు విడాకులు ఇచ్చిన వెంటనే వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి నిరాకరించి.. ఇంటి నుంచి గెంటివేశారు’. ఈ ఫిర్యాదు ఆధారంగా, 2019లో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ట్రయల్‌కోర్టులో చార్జిïÙట్‌ దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రంజిత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు.  

అన్నీ తెలిసే పిటిషనర్‌తో ఉన్నారు..: పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదన లు వినిపిస్తూ..‘పిటిషనర్‌ నిర్దోషి. ఫిర్యాదుదారు ఆరోపణలతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు. రెండేళ్లు గడిచిన తర్వాత పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఇంత ఆలస్యానికి కారణం చెప్పలేదు. ఫిర్యాదుదారుకు బ్లాక్‌మెయిల్‌ చేసే అలవాటు ఉంది. కేశవ్‌కుమార్‌ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసింది. మాదాపూర్‌ పోలీసులు నమోదు చేసిన ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదులో తేదీలు, సమయం, స్థలం సరిగా వివరించలేదు. 

పిటిషనర్‌పై నేరాలు ఆమోదయోగ్యం కాదు.. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలి’అని కోరారు. ఏపీపీ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్‌పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నా యి. అతనిపై ఆరోపణలలో నిజానిజాలు ట్రయల్‌కోర్టు తేలుస్తుంది. పిటిషన్‌ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2019, జనవరి 16న ఇంటి నుంచి గెంటివేశారని చెబుతున్న మహిళ ఫిర్యాదు చేయడానికి 23 వరకు ఎందుకు ఆగాల్సి వచి్చందో పేర్కొనలేదన్నారు. 

ఆమెకు ఇలా ఫిర్యాదు చేసే అలవాటు ఉందని గత వివరాలు పరిశీలిస్తే తెలుస్తోందన్నారు. పిటిషనర్, మహిళ.. ఇద్దరూ మేజర్లు. వారి మధ్య సంబంధం ఏకభిప్రాయంతోనే జరిగినట్టు అవగతమవుతోందని స్పష్టం చేశారు. 21ఏళ్ల మహిళకు తాను ఏం చేస్తున్నానో తెలుసని.. తెలిసే పిటిషనర్‌తో ఉన్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీనికి పిటిషనర్‌ను బాధ్యుడిని చేయలేమని తేల్చిచెప్పారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పిటిషనర్‌పై కేసును కొట్టివేస్తున్నామని తీర్పునిచ్చారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)