Breaking News

పోడియంలు తీసేయండి

Published on Sat, 12/27/2025 - 02:50

సాక్షి, హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దశాబ్దాలుగా ఉన్న ఓ ఆనవాయితీకి ఆ శాఖ స్వస్తి పలకనుంది. క్వాసీ జ్యుడీషియల్‌ (పాక్షిక న్యాయపరమైన) అధికారాలున్న సబ్‌రిజిస్ట్రార్ల చుట్టూ వారి కార్యాలయాల్లో ఉండే పోడియంలు ఇక నుంచి మాయం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్లంతా పోడియంలు తొలగించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశాలు జారీ చేశారు. పోడియం ఉన్నప్పుడు ఫొటోను, తొలగించిన తర్వాతి ఫొటోను పంపాలని ఆ ఆదేశాల్లో ఆయన స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పోడియంల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. 

నిజాం కాలం నుంచే..: వాస్తవానికి నిజాం కాలం నుంచే సబ్‌రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారాలుండేవి. వారికి క్వాసీ జ్యుడీషియల్‌ అధికారాలను చట్టం కల్పించింది. డాక్యుమెంట్లను రిజిస్టర్‌ చేయించేటప్పుడు క్రయ, విక్రయదారులు, సాక్షుల స్టేట్‌మెంట్లను తీసుకోవడంతోపాటు వీలునామాలను విచారించే అధికారం కూడా ఉండటంతో న్యాయస్థానాల తరహాలో వారికి పోడియంలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ట్రెజరీ, జ్యుడీషియల్‌ అధికారులు సెలవులో ఉన్నప్పుడు పాత కాలంలో ఆ బాధ్యతలను సబ్‌రిజిస్ట్రార్లకు అప్పగించే వారు. సబ్‌రిజిస్ట్రార్లు సెలవులో వెళ్తే జ్యుడీషియల్‌ అధికారులు ఈ బాధ్యతలు నిర్వహించేవారు.

అయితే కాలానుగుణంగా చాలా మార్పులు రావడం, ఇప్పుడు అన్ని శాఖలు వేటికవే పనిచేస్తుండటంతో రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అందుకనుగుణంగా మార్పును ఆహ్వానించాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. కలెక్టర్లకే లేని ఆర్భాటం సబ్‌రిజిస్ట్రార్లకు ఎందుకని ప్రశ్నించిన ఆయన.. పోడియంల తొలగింపుపై ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పోడియంలను తొలగించనున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)