Breaking News

అలర్ట్‌లకు అర్థం తెలుసా?

Published on Wed, 09/04/2024 - 03:47

రోజూ చూస్తూనే ఉన్నాం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ అని.. ఇంతకీ వాటి అర్థం ఏంటో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం.  

గ్రీన్‌  అలర్ట్‌
ఏదైనా ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో 6.4 సెం.మీ. కన్నా తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటే వాతావరణ అధికారులు ఈ అలర్ట్‌ జారీ చేస్తారు. వాతావరణ పరిస్థితుల్లో రాబోయే మార్పుల గురించి గ్రీన్‌ అలర్ట్‌ తెలియజేస్తుంది. అయితే ఈ అలర్ట్‌ కింద ప్రజలకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉండదు.

ఎల్లో అలర్ట్‌
ఒక నిరీ్ణత ప్రదేశంలో 6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ. మధ్య వర్షం కురిసే అవకాశం ఉందన్న అంచనాతో దీన్ని జారీ చేస్తారు. ఈ అలర్ట్‌ జారీ చేశారంటే ప్రస్తుత వాతావరణం కాస్త ప్రతికూలంగా మారుతుందని అర్థం. 30–40 కి.మీ. వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్‌ ఇస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని అధికార యంత్రాంగానికి సూచిస్తారు.

ఆరెంజ్‌ అలర్ట్‌
24 గంటల వ్యవధిలో 11.56 సెం.మీ. నుంచి 20.44 సెం.మీ. మధ్య వర్షం కురవొచ్చన్న అంచనాతో ఆరెంజ్‌అలర్ట్‌ను ఐఎండీ జారీ చేస్తుంది. 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్‌ను విడుదల చేస్తుంది. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయిందంటే రవాణా సరీ్వసులపై ప్రతికూల వాతావరణం ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అర్థం.

రెడ్‌  అలర్ట్‌
24 గంటల వ్యవధిలో ఒక ప్రాంతంలో 20.45 సెం.మీ.కుపైగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే రెడ్‌ అలర్ట్‌ జారీ చేస్తారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను రెడ్‌ అలర్ట్‌ సూచిస్తుంది. రవాణా, విద్యుత్‌ సేవలకు అవాంతరాలు ఎదురవడంతోపాటు ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. రెడ్‌ అలర్ట్‌ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. గరిష్టంగా ఐదు రోజులపాటు ఆయా అలర్ట్‌లకు సంబంధించిన హెచ్చరికలు అమల్లో ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.   –సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌
 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)