Breaking News

Telangana: రెండు రోజులు వర్షాలే.. వర్షాలు

Published on Sat, 07/20/2024 - 06:03

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం వాయుగుండం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి గురువారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.

దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది. 

నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ... మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచి్చంది. శుక్రవారం రాష్ట్రంలో సగటున 2.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్‌లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 25.76 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 31.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

ములుగు జిల్లాలో ఒకరి గల్లంతు 
ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం తానిçపర్తికి చెందిన బానారి రాజు (45) గోదావరిలో గల్లంతయ్యాడు. చేపల వేటకని గురువారం వెళ్లిన రాజు శుక్రవారం ఉదయం వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మహదేవపూర్‌ మండలం అన్నారం వైపు నుంచి దామెరకుంట వైపుగా ట్రాలీ ఆటో గుండ్రాత్‌పల్లి సమీపంలో గల అలుగువాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్‌ అప్రమత్తమై ఆటో ఎక్కి అరవడంతో గమనించిన స్థానికులు రక్షించారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)