Breaking News

నిప్పుల కొలిమి!

Published on Thu, 05/02/2024 - 05:03

పదేళ్లలో ఇవే అత్యధికం
గత పదేళ్ల వేసవి సీజన్‌ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్నవే అత్యధికమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మే ప్రారంభంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. ఈసారి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయని అంటున్నారు. ఎప్పుడూ కూడా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అటుఇటుగా నమోదయ్యేవని.. ఇప్పుడు మాత్రం 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా కొనసాగుతున్నాయని వివరిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌  : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది.. దంచికొడుతున్న ఎండలతో కుతకుత లాడుతోంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలు కూడా దాటిపోయాయి. బుధవారం అత్యధికంగా నల్లగొండ జిల్లా గుడాపూర్‌లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

ములుగు జిల్లా మంగపేటలో 46.5, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5, నల్లగొండ జిల్లా చండూరులో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొనసాగుతాయని వాతా వరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే ఏకంగా 5 డిగ్రీ లు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నట్టు తెలిపింది.

11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..
ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నిర్మల్, నిజా మాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యా పేట, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని.. వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది.

 మిగతా జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. మొత్తంగా వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీయవచ్చని హెచ్చరించింది. 

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. తక్షణ సహాయక చర్యలు తీసు కునేలా సమాయత్తం కావాలని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)